Telangana Congress Campaign : భారతీయ జనతా పార్టీపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. బీజేపీ తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని చెబుతూ పెద్ద ఎత్తన ప్రచారం ప్రారంభించింది. ఇంతకు ముందే నయవంచన పేరుతో తెలంగాణ మొత్తం పోస్టర్లు వేశారు. తాజాగా గాడిద గుడ్డు పేరుతో ప్రచారం ప్రారంభించారు. ఎమ్మెల్సీ వెంటక్ బల్మూర్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తె తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందనే వినూత్న ప్రచారం ప్రారంభించారు.
తెలంగాణ అభివృద్ది కోసం రాష్ట్రానికి రావాల్సినవి ఇవ్వమంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని గుర్తు చేసేలా పోస్టర్ పెట్టి.. పోస్టర్ ముందు గాడిద గుడ్డులా కనిపించే ఆకారాన్ని పెట్టారు. అటు మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వమంటే గాడిద గుడ్డు ఇచ్చిందని.. తెలంగాణకు కనీసం ఒక ఐఐఎం, ఎన్ఐటీ విద్యాలయం ఇవ్వమంటే ఇవ్వలేదని.. విభజన చట్టంలో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. బడ్జెట్ లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా ఇవ్వమంటే ఇవ్వలేదని.. 811 టీఎంసీ కృష్ణ జలాలలో సరైన వాటా ఇవ్వమంటే ఇవ్వలేదని.. విభజన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వీటన్నింటికీ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు ఏమాత్రం సహకరించలేదని . బీజేపీ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదని అంటున్నారు. బీజేపీ నాయకులను గెలిపిస్తే కూడా మన రాష్టానికి అభివృద్ధి జరిగేది లేదని ప్రజలు గమనించాలన్నారు. బీజేపీని మళ్ళీ గెలిపిస్తే ఇంకా పెద్ద గాడిద గుడ్డు ఇస్తారు తప్ప అభివృద్ధి చెయ్యరని ప్రజలకు చెబుతున్నారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలాంటి ప్రచారాలను ఉద్ధృంగా చేసేది. ఎన్నికలు వచ్చినప్పుడు లేదా మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున పోస్టర్లు వేసేవారు. అయితే అవేమీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఇప్పుడు ్దే పద్దతిలలో కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.