Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దాదాపు ఖాయమైంది. పది రౌండ్లలో ఇప్పటికే ఆరు రౌండ్‌ల కౌంటింగ్ పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 15వేలకుపైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు. అధికారిక ఫలితాలు వచ్చే వరకు సమయం పట్టొచ్చు. అధికారికంగా కేవలం మూడు రౌండ్ ఫలితాలను మాత్రమే ఎన్నికల సంఘం విడుదల చేసింది. అందులో కూడా కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ ఉంది. 

Continues below advertisement

మొదట పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపులో చూస్తే కేవలం నాలుగు  ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. అయితే పోటీ హోరాహోరీగా ఉంటుందని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే మొదటి రౌండ్‌ ఫలితాలు వచ్చాయి. కీలకమైన షేక్‌పేట్‌కు ఈవీఎం కౌంటింగ్‌లో కాంగ్రెస్‌కు స్వల్ప మెజార్టీ వచ్చింది. ఈ రౌండ్‌లోనే భారీ మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. కానీ అక్కడ వందల ఓట్లు మెజార్టీ రావడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. పోటీ హోరాహోరీ ఉంటుందని ఖాయమే విశ్లేషణలు వినిపించాయి. 

రెండో రౌండ్ పూర్తి అయిన తర్వాత తీరు మారింది. మొదటి రౌండ్‌లో స్వల్ప ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తర్వాత ఏ రౌండ్‌లో కూడా తగ్గేదేలే అన్నట్టు దూసుకెళ్లారు. బీఆర్‌ఎస్‌కు ఎక్కువ ఓట్లు వస్తాయని అనుకున్న ప్రాంతాల్లో కూడా క్లియర్‌గా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ ఆధిక్యం ప్రదర్శించారు. దీంతో ప్రతి రౌండ్‌లో కాంగ్రెస్‌కు మూడువేలకుపైగా మెజార్టీ సాధిస్తూ వచ్చారు. 

Continues below advertisement