Chittoor News: చిత్తూరు జిల్లా పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడే(Nara Chandrababu Naidu). ఉమ్మడి రాష్ట్రంతో కలిపి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ,మూడుసార్లు ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న ఆయన...రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు. చిత్తూరు(Chittoor) జిల్లా కుప్పం(Kuppam) నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన...మరోసారి బరిలో దిగారు. జిల్లాలో కీలక నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Pedhireddy Ramchandra Reddy), మంత్రి ఆర్కే రోజా(Roja), అమర్‌నాథ్‌రెడ్డి(Amarnath Reddy) తదితరులు పోటీలో ఉన్నారు. వీరందరి ఆస్తుల వివరాలు ఒకసారి చూద్దాం.....


చంద్రబాబు, పెద్దిరెడ్డి ఆస్తులు
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి(Bhuvaneswari) ఆస్తులు చూస్తే కళ్లుచెదిరిపోవాల్సిందే . హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారం చేస్తున్న నారా భువనేశ్వరి, చంద్రబాబు  ఆస్తులు కలిపి మొత్తం 668 కోట్లు ఉన్నాయి. చంద్రబాబు, భువనేశ్వరి పేరిట బ్యాంకుల్లో క్యాష్‌, డిపాజిట్ల్ కలిపి 60 లక్షలు ఉండగా...కేవలం హెరిటేజ్‌లోని షేర్లు విలువే 549 కోట్లుగా ఉంది. మరో 22 కోట్లు పర్సనల్‌ లోన్ అడ్వాన్స్‌గా తీసుకున్నారు. బంగారం, వాహనాలు అన్నీ కలిపి మరో 2కోట్ల 20 లక్షలవరకు ఉంది. మొత్తంగా చంద్రబాబు పేరిట  47 లక్షల చరాస్తులు ఉండగా...ఆయన భార్య భువనేశ్వరి పేరిట 573 కోట్లు ఉంది. మొత్తం చంద్రబాబు దంపతుల చరాస్తుల విలువ574 కోట్లకుపైగానే ఉంది. హైదరాబాద్‌ మదీనాగూడలో 45 కోట్లవిలువ చేసే భూమి భువనేశ్వరి పేరిట ఉంది. కాంచీపురంలో మరో 30 కోట్ల విలువైన కమర్షియల్ బిల్డింగ్ ఉంది. చంద్రబాబు పేరిట హైదరాబాద్‌(Hyderabad), నారావారిపల్లె(Naaravaripalle)లో కలిపి 20 కోట్ల విలువైన ఇల్లు ఉన్నాయి. చంద్రబాబు దంపతుల స్థిరాస్తి 94 కోట్లుగా ఉంది. మొత్తం చంద్రబాబు ఆస్తుల విలువ కలిపితే 668 కోట్లుగా ఉన్నట్లు  గత ఎన్నికల్లో అఫిడవిట్‌లో సమర్పించారు. అలాగే వివిధబ్యాంకుల నుంచి ఆయన తీసుకున్న అప్పులు పదిహేనున్నర కోట్లుగా ఉంది.


చిత్తూరు జిల్లాకు చెందిన కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Pedhireddy Ramachandra Reddy) ఆస్తులు 130 కోట్లు ఉండగా...అప్పులు 20 కోట్లు వరకు ఉన్నాయి. ఆయనకు, ఆయన భార్యకు కలిపి బ్యాంకులో క్యాష్‌, డిపాజిట్లు, బాండ్లు కలిపి ఎనిమిదిన్నర కోట్లు ఉండగా... బ్యాంకుల నుంచి తీసుకున్న పర్సనల్‌ లోన్ అడ్వాన్స్ మరో 12 కోట్లు ఉంది. బంగారం, వాహనాలు అన్నీ కలిపి మొత్తం చరాస్తుల విలువ 21 కోట్లు ఉంది. పెద్దిరెడ్డి దంపతులకు 27 కోట్లవిలువైన వ్యవసాయ భూములు,  ఐదు కోట్ల విలువైన కమర్షియల్ బిల్డింగ్‌లు, బెంగళూరు, తిరుపతిలో కలిపి 13 కోట్ల విలువైన ఇల్లు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ  109 కోట్లు వరకు ఉంది. వివిధ బ్యాంకుల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు తీసుకున్న అప్పు 20 కోట్ల 38 లక్షల ఉంది. 


చిత్తూరు జిల్లాకే చెందిన మరో మంత్రి ఆర్కేరోజా(RK Roja) ఆస్తుల విలువ తొమ్మిదిన్నర కోట్లు ఉండగా...అప్పులు 70 లక్షలు ఉన్నాయి. రోజా కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకుల్లో క్యాష్‌, డిపాజిట్లు కలిపి 35 లక్షలు ఉండగా...మరో 80 లక్షల విలువైన పర్సనల్‌ లోన్ అడ్వాన్స్‌లు ఉన్నాయి. కోటిన్నర విలువైన 8 కార్లు ఉన్నాయి. 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. మొత్తం చరాస్తులు విలువ 3 కోట్ల 60 లక్షలు ఉన్నాయి. కాంచీపురంలో 60 లక్షల విలువైన వ్యవసాయ భూములు, 3కోట్లకు పైగా విలువైన ప్లాట్లు, హైదరాబాద్‌లో 2 కోట్ల విలువైన ఇల్లు ఉంది. మొత్తం స్థిరాస్తుల విలువ 5 కోట్ల 73 లక్షలుగా ఉంది. అలాగే వివిధ బ్యాంకుల నుంచి రోజా తీసుకున్న అప్పు 71 లక్షలుగా ఉంది.


చిత్తూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డికి(Amaranath Reddy) 12 కోట్ల రూపాయల ఆస్తి, మూడు కోట్ల విలువైన అప్పులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో ఉన్న క్యాష్‌, డిపాజిట్లు కలిపి కోటి 20 లక్షలు ఉండగా... పర్సనల్ లోన్ అడ్వాన్స్‌ మరో కోటి రూపాయలు ఉంది. వివిధ బ్యాంకుల్లో బాండ్లు. షేర్లు విలువ నాలుగున్నర కోట్లు ఉంది. బంగారం, వాహనాలు, ఇతర ఆస్తులు కలిపి 7 కోట్ల 30లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. కోటిన్నర విలువైన వ్యవసాయ భూమి, 2 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి, 60 లక్షల విలువైన కమర్షియల్ బిల్డింగ్‌లు, కోటి రూపాయల విలువైన ఇల్లు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ 5 కోట్లు వరకు ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు 3కోట్ల 24 లక్షలుగా ఉంది.


చిత్తూరు జిల్లాకు చెందిన మరో కీలక నేత నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి(Nallari Kishore Kumar Reddy)...ఈయన మాజీముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు. ఈయన ఆస్తి దాదాపు 20 కోట్లు ఉండగా...అప్పులు 9 కోట్లు పైనే ఉన్నాయి. బ్యాంకులో డిపాజిట్లు, క్యాష్ కలిపి 13 లక్షలు ఉండగా...పర్సనల్ లోన్‌ ఎమౌంట్ రెండున్నర కోట్లు ఉంది. 4 కార్లు విలువ 80 లక్షల వరకు ఉంది. 15 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ మూడున్నర కోట్లు ఉంది. 33 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది దీని విలువ ఆరున్నర కోట్లు ఉంటుంది. హైదరాబాద్‌, కలికిరిలో ఇళ్లు కలిపి మొత్తం 9కోట్లకు పైగానే విలువ ఉంది. కిశోర్‌కుమార్‌రెడ్డి స్థిరాస్తి విలువ 15 కోట్ల 67 లక్షల ఉంటుంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు 9కోట్ల 27 లక్షల ఉంది.


చంద్రగిరి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీపడుతున్న పులివర్తి నాని(Pulivarthi Nani) ఆస్తుల విలువ దాదాపు 9 కోట్లు ఉండగా...అప్పులు 4 కోట్ల ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో క్యాష్‌, డిపాజిట్ కలిపి 35 లక్షలు ఉండగా...బ్యాంకుల నుంచి తీసుకున్న పర్సనల్ లోన్ రెండున్నర కోట్లు ఉంది. కోటిన్నర విలువైన లారీలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ నాలుగున్నర కోట్లు ఉంది.32 లక్షల విలువైన వ్యవసాయ భూమి, 30 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి, మూడున్నర కోట్లు విలువైన ఇల్లు, ప్లాట్లు ఉన్నాయి.