Penamaluru Ticket TDP : పెనుమలూరు అసెంబ్లీ నియోజక వర్గంలో టీడీపీ టిక్కెట్ ఎవరికి కేటాయిస్తారన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.  చంద్రబాబు   రెండు జాబితాల్లో బోడె ప్రసాద్‌ పేరును ప్రకటించలేదు. అయితే ప్రత్యేకంగా మనుషుల్ని పంపి ఈ సారి టిక్కెట్ లేదని చెప్పించారు.  ప్రత్యామ్యాయంగా చంద్రబాబు ఏదో ఒకటి చూస్తారని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బోడె ప్రసాద్‌కు సమాచారం వెళ్లింది. ఈ సమాచారం తర్వాత  బోడె ప్రసాద్‌ వర్గీయులు, కార్యకర్తలు, నేతలు రోడ్లపైకొచ్చి నిరసన తెలిపారు. చంద్రబాబు కుటుంబసభ్యులు పోటీ చేస్తే సరే లేకపోతే చంద్రబాబు ఫోటోతో తానే బరిలోకి దిగుతానన్నారు. దేవినేని ఉమ సహా అనేక పేర్లతో ఐవీఎర్ఎస్ సర్వేలు నిర్వహించారు. చివరిక   బోడె ప్రసాద్ నే ఖరారు చేశారు. 


పెనమలూరులో గత ఎన్నికల్లో ఓడిన బోడె ప్రసాద్ 


పెనుమలూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా పేరు ఉంది. అయితే గత ఎన్నికల్లో బోడె ప్రసాద్ ఓడిపోయారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి పార్థసారధి విజయం సాధించారు. బోడె ప్రసాద్.. వైసీపీలో ఉండి చంద్రబాబుపై బూతులు తిట్టే నేతలు అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీలకు మిత్రుడు అన్న ప్రచారం ఉంది. ఈ కారణంగా ప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వకూదని అనుకున్నారని చెబుతున్నారు. అయితే వారిద్దరితో తన స్నేహాన్ని ఎప్పుడో  తెంపేసుకున్నానని బోడె ప్రసాద్ చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఎప్పుడూ కలవలేదన్నారు. అదే సమయంలో మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీలో చేరడంతో ఆయనకే సీటు ఇవ్వాలనుకున్నారు. 


మైలవరం కాకపోతే పెనుమలూరు ఇస్తారనుకున్న దేవినేని ఉమ 


మైలవరంలో వ్యతిరేకత ఉంటే.. ఆ సీటు వసంతకు ఇచ్ిచన తనకు  పెనుమలూరు అయినా ఇస్తారని  మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమా  ఆశలు పెట్టుకున్నారు.  చంద్రబాబు కూడా మైలవరం సీటును వసంత కృష్ణప్రసాద్‌కు కేటాయించి దేవినేని ఉమాను కృష్ణా జిల్లా పెనమలూరుకు పంపుదామని ఆలోచనలు చేశారు. అనుకున్నట్టుగానే మైలవరం స్థానాన్ని వసంత కృష్ణప్రసాద్‌కు ఖరారు చేశారు. ఇక పెనమలూరు సీటును దేవినేని ఉమాకు ఇవ్వాలని అనుకున్నా సానుకూలత కనిపించలేదు. స్థానిక టీడీపీ శ్రేణులు బోడె ప్రసాద్‌కు మద్దతుగా నిలిచారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. బోడె ప్రసాద్‌కు టికెట్‌ ఇవ్వకుంటే ఒప్పుకునేది లేదని, దేవినేని ఉమాకు సీటిస్తే తప్పకుండా ఓడించి తీరుతామని హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కోసం కష్ట పడి పని చేశానని, కోట్ల రూపాయలు వెచ్చించానని, కానీ ఈ సారి టికెట్‌ లేదని చెబుతున్నారని బోడె ప్రసాద్‌ కన్నీటి పర్యంతమయ్యారు. కావాలనే కొంత మంది నేతలు తనపై కుట్రలు పన్నారని పరోక్షంగా దేవినేని ఉమాను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. తనపై లేనిపోనివి అధిష్టానానికి చెబుతున్నారని, కొడాలి నానితో కానీ, వంశీతో కానీ ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఉన్నట్లు పార్టీ పెద్దలకు చెప్పి తనను అడ్డుకోవాలని కుట్రలు పన్నినట్టు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.


ప్రజల్లో తిరిగే నేత బోడె ప్రసాద్ 
 
బోడె ప్రసాద్‌ పెనమలూరు అసెంబ్లీ నియోజక వర్గంలో సామాన్యుడిగా తిరుగుతూ ఉంటారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన బైక్ మీద వెళ్లి తప్పు చేసి ఉంటే క్షమించాలని ప్రజల్ని అిగారు.  సైకిల్‌ మీద, బుల్లెట్‌ మీద ప్రతి ఇంటికీ తిరిగి ప్రజలను కలవడం పలకరించడం వారి యోగ క్షేమాలు తెలుసుకోవడం, సమస్యల పరిష్కారనికి పని చేయడం అతని ప్రత్యేకత. ని 2008లో పెనమలూరు అసెంబ్లీ స్థానం ఏర్పడింది. ఇప్పటి వరకు మూరు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. రెండు సార్లు కొలుసు పార్థసారధి గెలువగా ఒక సారి బోడే ప్రసాద్‌ విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి, 2019లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి పార్థసారధి గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బోడే ప్రసాద్‌ విజయం సాధించారు.