Tejashwi Yadav Ahead In Raghopur constituency:  బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2025లో రాఘోపూర్ అసెంబ్లీ కాన్‌స్టిట్యూన్సీ  కౌంటింగ్ ఫలితం తేజస్వీ యాదవ్ కు అనుకూలంగ ామారుతోంది.  ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) ప్రకారం, 30 రౌండ్లలో 25వ రౌండ్ వరకు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) అభ్యర్థి తేజస్వి ప్రసాద్ యాదవ్ 1,03,387 ఓట్లతో బలమైన లీడ్‌లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి సతీష్ కుమార్ 89,484 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. మెజారిటీ 13,903 ఓట్లు (+13,903)గా ఉండటంతో, తేజస్వి గెలుపు దాదాపు ఖాయమని అంచనా.  

Continues below advertisement

Continues below advertisement

కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైనప్పుడు మొదటి 5-6 రౌండ్లలో తేజస్వి యాదవ్  వెనుకబడ్డారు.   BJP అభ్యర్థి సతీష్ కుమార్ 5,000-7,000 ఓట్ల మెజారిటీతో ముందుండటంతో మహాఘట్‌బంధన్ శ్రేణుల్లో ఆందోళన ఏర్పడింది.  తేజస్వి ఓటమి అంచనాలు వచ్చాయి.  తేజస్వీ వెనుకబడటానికి   ప్రధాన కారణాలు పోస్టల్ బ్యాలెట్స్ , మిలటరీ వోట్లు. రాఘోపూర్‌లో మొత్తం 2,500 పోస్టల్ బ్యాలెట్స్‌లో 60 శాతం సుమారు 1,500  BJPకు వచ్చాయి, ఎందుకంటే ఈ ప్రాంతంలో సైనిక్, పారామిలిటరీ సిబ్బంది ఎక్కువగా BJP మద్దతుదారులు. మొదటి రౌండ్లలో ఈ బ్యాలెట్స్ కౌంట్ అవడంతో BJP లీడ్ తీసుకుంది. అలాగే, EVMలలో మొదటి కొన్ని గా గ్రామీణ ప్రాంతాలు BJP అనుకూలంగా ఉన్నాయి, ఇది "ప్రారంభ ట్రెండ్"గా కనిపించింది. విశ్లేషకులు "పోస్టల్ వోట్లు NDAకు ఎల్లప్పుడూ అడ్వాంటేజ్" అని చెబుతున్నారు, 2020లో కూడా ఇలాంటి ట్రెండ్ కనిపించింది.            

కానీ, 7వ రౌండ్ నుంచి తేజస్వి ఓట్లు పెరగడం ప్రారంభమయ్యాయి.   25వ రౌండ్ వరకు 1,03,387 ఓట్లతో ముందుండటంతో, మిగిలిన 5 రౌండ్లలో మెజారిటీ 15,000కి చేరింది. ఈ విజయానికి ముఖ్య కారణాలు మూడు  మైనారిటీ , EBC  ఓట్ల కన్సాలిడేషన్. రాఘోపూర్‌లో 30 శాతం ముస్లింలు,   25 శాతం యాదవ్‌లు, 20 శాతం EBC వర్గాలు ఉన్నాయి . 2020లో 36,000 మెజారిటీ సాధించినప్పటికీ, ఈసారి  ఓట్ల శాతం పెరిగినా తేజస్వీ ఓట్ల శాతం తగ్గిపోయింది.  జన సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) విభజన ప్రభావం తక్కువ. చంచల్ కుమార్ (జేఎస్‌పీ)కు 2,217 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది తేజస్వీకి మేలు చేసింది.