Adjustment of Seats Of India Alliance in UP: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో అనేక పార్టీలు కలిపి ఇండియా కూటమిగా ఏర్పాటయ్యాయి. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ఒకే అభ్యర్థిని బీజేపీపై పోటీ ఉంచాలని, అప్పుడే బీజేపీపై విజయం సాధించడం సాధ్యమవుతుందని కూటమి భావించింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ప్రక్రియలో అవాంతరాలు ఏర్పడడం, కూటమి కన్వీనర్‌గా, ఎన్నికల తరువాత ప్రధాన మంత్రి అభ్యర్థి ఎంపిక తదిర అంశాలపై ఏకాభిప్రాయం రాకపోవడంతో పలు పార్టీలు ఆదిలోనూ కూటమి నుంచి వైదొలిగాయి. ఇందులో కీలకమైన బీహార్‌కు చెందిన నితీష్‌ కుమార్‌ పార్టీ కూడా ఉంది. ఆయన ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లడమే కాకుండా బీజేపీతో కలిసి సర్కారును ఏర్పాటు చేసుకున్నారు. గడిచిన కొన్నాళ్ల నుంచి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న ఆయన.. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన వెంటనే బీజేపీకి స్నేహహస్తం చాచారు. అదే పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇండియా కూటమి ముందుకెళ్లడం సాధ్యమనుకుంటున్న తరుణంలో దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి మధ్య సీట్ల పంపకాలు సాఫీగా సాగుతున్నాయి. కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, ఎస్సీ మధ్య సీట్ల పంపకాలు దాదాపు కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. ఇది ఇండియా కూటమిలోని పార్టీలకు సానుకూల అంశంగా చెప్పవచ్చు. 


ఎస్పీకి 62 సీట్లు.. కాంగ్రెస్‌కు 17 సీట్లు


దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌, ఎస్పీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇక్కడ సీట్ల పంపకాలు అంత వేగంగా కొలిక్కి వచ్చే అవకాశం లేదని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా సీట్ల సర్ధుబాటు ప్రక్రియ సాఫీగా సాగుతున్నట్టు చెబుతున్నారు. దాదాపు సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా, కాంగ్రెస్‌ 17 స్థానాల్లో, ఎస్పీ 62 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించినట్టు చెబుతున్నారు. ఒకచోట ఆజాద్‌ సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయనుంది. కాంగ్రెస్‌, ఎస్పీ మధ్యయ సయోధ్యలో కుదరడంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించినట్టు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో 29 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఖజురహో స్థానంలో యూపీ పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్ధతు ఇవ్వనుంది. 


మిగిలిన రాష్ట్రాల పరిస్థితి


దేశంలోని కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన పార్టీ అయిన ఎస్పీతో పొత్తు తేలడంతో కూటమి నేతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో పొత్తులు తేలాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి అసలు కూటమిలో ఉన్నారో, లేరో కూడా తెలియని పరిస్థితి ఉంది. గతంతో నిర్వహించిన ఒక సమావేశానికి ఆమె హాజరు కాలేదు. ఆఫ్‌ కూడా కూటమిలో ఉంటుందా..? లేదా..? అన్న దానిపై స్పష్టత లేదు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో పొత్తుల లెక్కలు తేల్చి ఎన్నికలకు సిద్ధం కావాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఆ దిశగానే కాంగ్రెస్‌ కూడా నిర్ణయాలను తీసుకుంటోంది.