ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు, ప్రైవేటు, అన్ ఎయిడెడ్, నాన్-మైనార్టీ, మైనార్టీ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా (బీ-1, బీ-2), సీ-కేటగిరీ (ఎన్నారై) సీట్లు, తిరుపతి పద్మావతి మహిళ వైద్య కళాశాల ఎన్నారై కేటగిరీ సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 19తో ముగియడంతో.. సీట్ల కేటాయింపు వివరాలను ఆగస్టు 20న ఉదయం 11 గంటలకు అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఫీజులు ఇలా..
విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద 35 శాతం సీట్లకు ఒక్కో ఏడాది రూ.12 లక్షలు, ఎన్నారై కేటగిరీ కింద ఏడాదికి రూ.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీ కేటగిరీ కింద ఇచ్చే ఎన్నారై సీట్లకు ఒక్కో ఏడాదికి దాదాపు రూ.30 లక్షలు, ఆపైన చెల్లించాలి. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 74165 63063, 89787 80501 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
MBBS MQ 2023-24 Phase 1 Collegewise Allotments.
PG (Medical) - MQ - PROVISIONAL MERIT LIST AFTER VERIFICATION OF SCANNED UPLOADED CERTIFICATES
PG (Medical) - MQ - PROVISIONAL LIST OF NOT ELIGIBLE CANDIDATES AFTER VERIFICATION OF UPLOADED DOCUMENTS
PG (Medical) - MQ - LIST OF CANDIDATES WHO HAVE NOT UPLOADED DOCUMENTS
PG (Dental) - MQ - PROVISIONAL MERIT LIST AFTER VERIFICATION OF SCANNED UPLOADED CERTIFICATES
PG (Dental) - MQ - LIST OF CANDIDATES WHO HAVE NOT UPLOADED DOCUMENTS
ALSO READ:
డిగ్రీ ప్రవేశాలకు మరో విడత 'దోస్త్' కౌన్సెలింగ్, స్పెషల్ డ్రైవ్ షెడ్యూలు ఇదే!
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే మూడు దశలో కౌన్సెలింగ్‌తోపాటు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ కూడా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు రౌండ్లలో కలిపి ఇప్పటిదాకా మొత్తం 1,89,046 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారంతా ఆయా కళాశాలల్లో రిపోర్ట్ కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంకా భారీగా సీట్లు మిగలడంతో మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇంజినీరింగ్, నీట్, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నందున విద్యార్థుల సౌకర్యార్థం మరో విడత 'దోస్త్' అడ్మిషన్లను నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈమేరకు నిర్ణయించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఆగస్టు 24 నుంచి 'గేట్-2024' దరఖాస్తుల స్వీకరణ, ఈసారి కొత్త పేపరు జోడింపు!
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి గేట్ నిర్వహణ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) చేపట్టింది. 'గేట్'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది. గేట్-2024 పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐఎస్సీ-బెంగళూరు షెడ్యూలును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో గేట్-2024 పరీక్ష నిర్వహించనున్నారు. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..