అమెరికాలో ఉన్నత విద్య ఆశించే విద్యార్థులకు ఇదొక సదావకాశం. ఓరియంట్ స్పెక్ట్రా ఆధ్వర్యంలో సెప్టెంబరు 16న ఉచిత 'USA ఎడ్యుకేషన్ ఫెయిర్' నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనే అభ్యర్థులకు 24 గంటల్లోనే ప్రవేశాలు పొందే అవకాశం కల్పించనున్నారు. ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. అదేవిధంగా ఉచిత విమాన టికెట్ పొందే అవకాశం కూడా పొందవచ్చు. విద్యార్థులకు స్కాలర్‌షిప్ అవకాశాలు కూడా కల్పించనున్నారు. ఇందుకు హైదరాబాద్,కూకట్‌పల్లిలోని హోట్ అభినందన్ గ్రాండ్ వేదిక కానుంది.


సెప్టెంబరు 16న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎడ్యుకేషన్ ఫెయిర్ జరుగనుంది. అందరికీ ప్రవేశం పూర్తిగా ఉచితం. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 81424 25256, 82977 72727 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. 


ప్రయోజనాలివి..


➥ కేవలం 24 గంటల్లోనే యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందవచ్చు.


➥ ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది.


➥ యూనివర్సిటీ ప్రతినిధులతో ముఖాముఖిగా మాట్లాడవచ్చు.


వేదిక: HOTEL ABINAND GRAND Y-JUNCTION , Hyderabad  


Registration


ALSO READ:


ఫ్రాన్స్‌లో చదవాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్ - 30 వేల మంది విద్యార్థులకు ఆహ్వానం
భారతదేశం నుంచి అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతీ ఏటా వేలాది మంది విద్యార్థులు అనేక దేశాలకు వెళ్తుంటారు. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా.. ఇలా ఆయా దేశాలకు వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది ఫ్రాన్స్‌కు వెళ్లి చదవాలి అనుకునే విద్యార్థులకు ఆ దేశ సర్కారు శుభవార్త చెప్పింది. 2030 నాటికి మన దేశం నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధమని ప్రకటించింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీ ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఏపీలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2023 కౌన్సెలింగ్ తుది విడత షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 12న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 14 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏపీఈఏపీసెట్-2023 తుది విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు  యూనివర్సిటీ & ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీల కాలేజీలలో కన్వీనర్ కోటా కింద ఇంజినీరింగ్, అగ్రికల్చర్ సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. 
ఏపీఈఏపీసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు సెప్టెంబరు 14, 15 తేదీల్లో నిర్ణీత ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించవచ్చు.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో సర్టిఫికేట్ ప్రోగ్రామ్, అర్హతలివే!
కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, 2024-25 విద్యా సంవత్సరానికిగానను సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మేనేజర్ స్థాయిలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. (లేదా) పీజీ (ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, మెడిసిన్, ఫార్మాస్యూటికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్)తో పాటు సంబంధిత రంగంలో మేనేజర్ స్థాయిలో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నవంబరు 15లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..