యాదాద్రి భువనగిరి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల అందిస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లు, సైకో అనలిటికల్ టెస్ట్‌లు, మెడికల్ టెస్ట్‌లు, షార్ట్ లెక్చర్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వివరాలు..
* సైనిక మహిళా కళాశాలలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సు
సీట్ల సంఖ్య: 40
కోర్సు వివరాలు: ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సను ఇంగ్లిష్ మీడియంలో నిర్వహిస్తారు. దీంతోపాటు మిలిటరీ ఎడ్యుకేషన్ అంశాలు కూడా బోధిస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఆఫీసర్ల నియామకానికి ఉద్దేశించిన యూపీఎస్సీ ఎగ్జామ్‌లకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ ప్రోగ్రామ్‌నకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ గుర్తింపు ఉంది.
అర్హత: ఇంటర్/ పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు మీడియంలో చదివినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లిష్ మీడియంలో చదివినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఇతర అర్హతలు: అభ్యర్థుల ఎత్తు కనీసం 152 సెం.మీ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం నగరాల్లో రూ.2 లక్షలు; పట్టణాల్లో రూ.1.50 లక్షలలోపు ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష, ఫిజికల్ టెస్ట్, సైకో అనలిటికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
* ప్రవేశ పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో కొన్ని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, మరికొన్ని ఖాళీల భర్తీ ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్ స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున మొత్తం 50 మార్కులకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
* ఫిజికల్ టెస్ట్: ఫిజికల్ టెస్టులో భాగంగా 100 మీటర్ల స్ర్పింట్, 400 మీటర్ల పరుగు, సిటప్స్, షటిల్ రేస్, అబ్‌స్టాకిల్ టెస్టులు నిర్వహిస్తారు. వీటికి 20 మార్కులు కేటాయించారు.
* సైకో అనలిటికల్ టెస్ట్‌లు: ఇందులో థీమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్(టీఏటీ)- ఒక బొమ్మ, వర్డ్ అసోసియేషన్ టెస్ట్(డబ్ల్యూఏటీ)- పది పదాలు, సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్ (ఎస్‌ఆర్‌టీ)- 5 ఎస్‌ఆర్‌టీలు ఉంటాయి. వీటికి 10 మార్కులు కేటాయించారు.
* మెడికల్ టెస్ట్: ఇందులో నిబంధనల ప్రకారం ఎత్తు, బరువు చెక్ చేస్తారు. కళ్లు, చెవులు, పళ్లు, ఫ్లాట్ ఫూట్, నాక్ నీస్, వర్ణాంధత్వం సంబంధిత పరీక్షలు నిర్వహిస్తారు. క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, సర్జరీలు జరిగాయా అన్న అంశాలు చెక్ చేస్తారు. ఒక అంశం ఇచ్చి చిన్న లెక్చర్ ఇవ్వమని అడుగుతారు. దీనికి 10 మార్కులు ఉంటాయి. తరవాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి కూడా 10 మార్కులు ప్రత్యేకించారు.
ప్రవేశ సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు: పదోతరగతి మార్కుల మెమో, ఇంటర్ సర్టిఫికెట్లు; టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, ఆరోగ్రశ్రీ/ రేషన్ కార్డ్; కులం, ఆదాయం, వైకల్యం ధ్రువీకరణ పత్రాలు, అభ్యర్థి ఫొటోలు.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.10.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.10.2022.
* హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 27.10.2022.
* ప్రవేశపరీక్ష తేది: 30.10.2022.
:: Also Read ::
Degree Courses: డిగ్రీలో కొత్త కోర్సులు, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి!
తెలంగాణలోని యూనివర్సిటీల్లో మూస విద్యావిధానానికి స్వస్తి పలకాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే ఏడాదికల్లా కొలువులిచ్చే కోర్సుల రూపకల్పనకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ముగ్గురు వైస్‌చాన్స్‌లర్లతో త్రిసభ్య కమిటీని నియమించింది. శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్ చైర్మన్‌గా, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి సభ్యులుగా కమిటీ వేసింది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Cyber Security: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, అర్హతలివే!
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ' సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణను దరఖాస్తులు కోరుతోంది. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికెట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు అక్టోబరు 27 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 7893141797 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
CLISC: సీఎల్‌ఐఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్ అర్హత!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5 నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది.
కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..