పౌరసేవల్లో వినూత్నంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) వైద్యరంగానికి సైతం సేవలను విస్తరించింది. ఇందులో భాగంగా తార్నకలోని టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సును ప్రారంభించనుంది. 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటాలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు మే 26 నుంచి దరఖాస్తు చేసుకోవ‌చ్చని ఆర్టీసీ ఎండీ స‌జ్జన్నార్ కోరారు. ఇంటర్ బైపీసీలో ఉతీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624 ఫోన్ నంబర్లను సంప్రదించవ‌చ్చు. ఈ కళాశాల‌లో బాలిక‌ల‌కు మాత్రమే ప్రవేశం క‌ల్పించ‌నున్నారు.


వివరాలు..


* టీఎస్‌ఆర్టీసీ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు- బాలికలకు మాత్రమే


కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.


అర్హత: ఇంటర్ (బైపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 17 సంవత్సరాలు నిండి ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: మెరిట్, సీట్ల సంఖ్య ఆధారంగా.


సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 9491275513, 7995165624 



ALso Read: 


బాసర ట్రిపుల్‌ ఐటీ షెడ్యూల్‌ విడుదల, జూన్‌ 5 నుంచి దరఖాస్తులు ప్రారంభం!
తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో ఆరేళ్ల బీటెక్‌ కోర్సులో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ షెడ్యూలు విడుదలైంది. ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకటరమణ బుధవారం (మే 24) షెడ్యూలును ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 1న నోటిఫికేషన్‌ వెలువడనుంది. జూన్‌ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే స్పెషల్‌ కేటగిరీ కింద పీహెచ్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ తదితర విద్యార్థులు జూన్‌ 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్‌ 26న మెరిట్‌ జాబితాను ప్రకటించనున్నారు. జులై 1న ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం చేయూత, విశాఖలో మరో శిక్షణా కేంద్రానికి సర్కార్ నిర్ణయం
ఎస్సీ విద్యార్దులకు విశాఖలో మరో శిక్షణా కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలు చేపట్టింది. విద్యార్థుల కోసం ప్రస్తుతం ఉన్న నీట్, జేఈఈ శిక్షణా కేంద్రాలు కాకుండా అదనంగా మరో శిక్షణా కేంద్రాన్ని విశాఖ జిల్లాలోని మధురవాడలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎస్సీ గురుకుల విద్యార్థులు పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు వీలుగా 56 అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. బీఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ల (డీసీఓ)ల సమీక్షా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ బాలుర కోసం అడవి తక్కెళ్లపాడు (గుంటూరు జిల్లా), చిన్నటేకూరు (కర్నూలు జిల్లా) లోనూ, బాలికల కోసం ఈడ్పుగల్లు (కృష్ణాజిల్లా) లోనూ నీట్, జేఈఈ శిక్షణా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..