తెలంగాణలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్–2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. పదోతరగతి అర్హత ఉన్న విద్యార్థులతోపాటు, ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభంకానుంది. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి మే 6న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో చేరేందుకు అర్హులు. ప్రవేశ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
వివరాలు..
* టీఎస్ఆర్జేసీ సెట్–2023
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ.
అర్హత: పదోతరగతి అర్హత ఉన్న విద్యార్థులతోపాటు, ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: టీఎస్ఆర్జేసీ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మల్టీపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. విద్యార్థులు ఎంచుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలడుగుతారు. ఎంపీసీ విద్యార్థులకు ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్ నుంచి; బైపీసీ విద్యార్థులకు ఇంగ్లిష్, బయోలజికల్ సైన్స్, ఫిజిక్స్ నుంచి అదేవిధంగా ఎంఈసీ గ్రూప్‌లో చేరేవారికి ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి పదోతరగతి స్థాయిలో ఒక్కోసబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
దరఖాస్తు ఫీజు: రూ.200.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 28.02.2023.
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 31.03.2023.
* ప్రవేశ పరీక్ష తేది: 06.05.2023.
Also Read:
BRAOU Admissions: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాం, స్పెషలైజేషన్లు ఇవే!
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లోని 10 యూనివర్సిటీ ప్రాంతీయ కేంద్రాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి, సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (నైసర్), యూనివర్సిటీ ఆఫ్ ముంబయి ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్) సంస్థల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) 2023' నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..