తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి పాలిసెట్ చివరి విడత సీట్లను జులై 14న కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 118 కళాశాలల్లో 31,739 సీట్లు అందుబాటులో ఉండగా 22,144 (69.76%) భర్తీ అయ్యాయి. అంటే 9,595 సీట్లు (30.24%) మిగిలిపోయాయి. దాదాపు మూడోవంతు సీట్లు భర్తీ కాలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 590 మందికి సీట్లు దక్కాయి. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 16 లోపు ఫీజు చెల్లించి, జులై 17 లోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


రెండు విడతల సీట్ల కేటాయింపు తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్లైడింగ్ నిర్వహిస్తారు. తదనంతరం స్పాట్ కౌన్సెలింగ్‌కు అవకాశమిస్తారు. కోర్సులవారీగా తీసుకొంటే సీఎస్‌ఈ కోర్సులో 87.62 శాతం సీట్లు భర్తీకాగా, ఆ తర్వాత ఈసీఈలో సీట్లు నిండాయి. ఈసారి అత్యధికంగా ఈఈఈలో 2,314, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 2,170, సివిల్ ఇంజినీరింగ్‌లో 1,987, ఈసీఈలో 1,045, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో 833 సీట్లు మిగిలిపోయాయి. వీటిల్లో చాలావరకు స్పాట్ కౌన్సెలింగ్‌లో భర్తీ అవుతాయని భావిస్తున్నారు. 


ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల వైపే మొగ్గు.. 
పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరే విద్యార్థుల్లో అత్యధికులు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలనే ఎంచుకొంటున్నారు. వసతులు, ల్యాబ్‌లు, నిపుణులైన ఫ్యాకల్టీ ఉండటంతో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఈ ఏడాది పాలిసెట్‌లో ప్రభుత్వ కాలేజీల్లో 84% సీట్లు నిండితే.. అదే ప్రైవేట్‌ కళాశాలల్లో 59% సీట్లే భర్తీ అయ్యాయి. జులై 14తో పాలిసెట్‌ తుది విడత సీట్లను కేటాయించారు. మొత్తం 118 కాలేజీలుంటే 69.76% సీట్లు నిండాయి. రెండు ప్రభుత్వ కాలేజీల్లో, ఒక ప్రైవేట్‌ కాలేజీలో 100% సీట్లు భర్తీ అయ్యాయి. 


జులై 21 నుంచి తరగతులు..
సీట్లు పొందిన విద్యార్థులు జులై 16 లోపు ఫీజు చెల్లించి, జులై 17 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 14 నుంచి 20 వరకు ఓరియంటేషన్‌ తరగతులు ప్రారంభంకానున్నాయి. జులై 21 నుంచి పూర్తిస్థాయిలో మొదటి సెమిస్టర్‌ తరగతులు ప్రారంభమవుతాయి. 


ALSO READ:


నీట్ యూజీ 2023 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
నీట్‌ యూజీ (NEET UG) 2023 కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 20  నుంచి ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) జులై 14న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచింది. నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీలను చూసుకోవచ్చు. నీట్ యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోనిప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్(కేంద్రయూనివర్సిటీల్లో) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్, సెంట్రల్ యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 15శాతం ఆలిండియా కోటా సీట్లు, 85 శాతం స్టేట్ కోటా సీట్లతో కలిపి 100 శాతం సీట్లకు ఎంసీసీ/DGHS కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
నీట్ యూజీ కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు జులై 13న విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఆగస్టు 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 25న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు, 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial