తెలంగాణలో ఎంఈ, ఎంటెక్, ఎం.ఆర్క్, ఎం.ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ పీజీఈసెట్' చివరి విడత కౌన్సెలింగ్‌లో వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 5,812 సీట్లు అందుబాటులో ఉండగా 3,592 మందికి సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారు అక్టోబరు 7 లోపు ఫీజు చెల్లించి కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తొలి విడత కౌన్సెలింగ్‌లో 3,627 మంది కళాశాలల్లో రిపోర్ట్ చేశారు. గతేడాది మాదిరిగానే సుమారు 11 వేల సీట్లుండగా.. అందులో 70 శాతం(7700 సీట్లు) వరకు కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.
పీజీఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 20 నుంచి 24 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ అప్‌లోడింగ్ ప్రక్రియకు అవకాశం కల్పించారు. సెప్టెంబరు 26న అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అభ్యర్థులకు సెప్టెంబరు 27, 28 తేదీల్లో వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పించారు. సెప్టెంబరు 29న ఆప్షన్ల సవరణకు అవకాశం ఇచ్చారు. తర్వాత సీట్ల కేటాయింపు వివరాలను కళాశాలలవారీగా అక్టోబరు 3న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సీట్లు పొందినవారు అక్టోబరు 3 నుంచి 7 మధ్య సంబంధిత కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికేట్లతోపాటు ట్యూషన్ ఫీజు చెల్లింపు రసీదుతో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ ఎత్తివేత, 'స్పాట్' ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారనుకున్న అభ్యర్థులకు ఉన్నత విద్యామండలి షాకిచ్చింది. మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను పక్కనపెడుతూ.. నేరుగా 'స్పాట్' ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబరు 4 నుంచి 18 వరకు ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది రెండు విడతల కౌన్సెలింగ్ మాత్రమే ఉన్నత విద్యామండలి నిర్వహించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, దరఖాస్తుకు వీరు అర్హులు
తెలంగాణలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి అక్టోబరు 2న ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఈ కోర్సులకు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 13 లోపు ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇత వివరాలకు 78931 41797లో సంప్రదించాలని విమలారెడ్డి సూచించారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..