హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్) 'టీఎస్ పీజీఈసెట్' షెడ్యూలును ఫిబ్రవరి 24న విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. టీఎస్ పీజీఈసెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌లో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2 నుంచి 4 మధ్యలో దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రూ.250 ఆలస్య రుసుంతో మే 5 వరకు, రూ. 1000 ఆలస్య రుసుముతో మే 10 వరకు, రూ.2,500 ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ.5,000 ఆలస్య రుసుంతో మే 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 21 నుంచి టీఎస్ పీజీఈసెట్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పీజీఈసెట్ షెడ్యూలు ఇలా..
➥ పీజీసెట్ నోటిఫికేషన్: 28.02.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ (అపరాద రుసుము లేకుండా: 30.04.2023.
➥ రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 05.05.2023.
➥ రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 10.05.2023.
➥ రూ.2500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.05.2023.
➥ రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 24.05.2023.
➥ దరఖాస్తు ఫీజు: రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 21.05.2023 నుంచి.
➥ పరీక్ష తేదీలు: 29.05.2023 - 01.06.2023 వరకు.
Also Read:
BRAOU Admissions: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాం, స్పెషలైజేషన్లు ఇవే!
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లోని 10 యూనివర్సిటీ ప్రాంతీయ కేంద్రాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి, సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
CMAT: కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ - 2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)-2023 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఫిబ్రవరి 13న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..