తెలంగాణలో బీపీఎడ్, డీపీఎడ్ సీట్ల భర్తీకి పీఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 9 నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు అక్టోబరు 7న ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అక్టోబరు 9 నుంచి 11 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని; అక్టోబరు 12, 13 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. 14న వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం కల్పించనున్నారు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి అక్టోబరు 17న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు అక్టోబర్ 18 నుంచి 21 వరకు ఫీజుచెల్లించి, సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలని రమేష్ బాబు తెలిపారు.


కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమెంట్‌ తేదీలు: అక్టోబరు 9 నుంచి 11 వరకు.


➥ వెబ్ ఆప్షన్ల న‌మోదు: అక్టోబరు 12, 13 తేదీల్లో. 


➥ వెబ్ ఆప్షన్ల సవరణ: అక్టోబరు 14.


➥ సీట్ల కేటాయింపు: అక్టోబ‌ర్ 17న. 


➥ కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: అక్టోబర్ 18 నుంచి 21 వరకు


ALSO READ:


త్వరలో మరో విడత ఐసెట్ కౌన్సెలింగ్, 'సెల్ఫ్ ఫైనాన్స్' విధానం అమలు
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి మరోవిడత ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈసారి రాష్ట్రంలో తొలిసారిగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నారు. ఇందులో మంజూరైన సీట్లకు సర్కారు నుంచి బోధనా రుసుములు వర్తించవు. తాజాగా 37 కళాశాలల్లో 3,060 ఎంబీఏ, 25 కళాశాలల్లో 2,700 ఎంసీఏ సీట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. త్వరలో వాటి భర్తీకి ప్రత్యేకంగా ఐసెట్ కౌన్సెలింగ్ జరపనున్నారు. 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. అయితే అలా చేరిన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ వర్తించదు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


GATE - 2024 దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)-2024 దరఖాస్తు గడువును ఐఐఎస్సీ-బెంగళూరు మరోసారి పొడిగించింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా అక్టోబర్‌ 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌టెండెడ్ పీరియడ్‌తో రూ.500 ఆలస్యరుసుముతో అక్టోబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్షలను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్‌ పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దరఖాస్తుకు డిసెంబరు 31 వరకు గడువు
తెలంగాణలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై... ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు 'నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌'కు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 31 వరకు గడువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్‌ మార్కుల్లో టాప్‌-20 పర్సంటైల్‌లో నిలిచిన 53,107 మంది ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యార్థులతోపాటు గతంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారు కూడా రెన్యువల్‌ కోసం డిసెంబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి