తెలంగాణలోని 194 ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్‌లో) ప్రవేశానికి దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు. ఈ మేరకు విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి ఫిబ్రవరి 14న ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి దరఖాస్తు గడువు ఫిబ్రవరి 15తో ముగియనుండగా, మరో వారంరోజులపాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటివరకు 43,498 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఉషారాణి తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
మోడల్ స్కూళ్లు ఉన్న మండల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 15న వెల్లడిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జూన్ 1న లేదా 2023 - 24 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లలో (మొత్తంగా 19,400 సీట్లు) ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే 7-10 తరగతుల్లోని మిగిలిన ఖాళీలను సీట్లను భర్తీ చేస్తారు.
వివరాలు...
* మోడల్ స్కూల్స్ ప్రవేశాలు - 2023
ప్రవేశాలు కల్పించే తరగతులు: 6, 7, 8, 9, 10.
వయోపరిమితి: 31.08.2023 నాటికి 6వ తరగతికి-10 సంవత్సరాలు, 7వ తరగతికి-11 సంవత్సరాలు, 8వ తరగతికి-12 సంవత్సరాలు, 9వ తరగతికి-13 సంవత్సరాలు, 10వ తరగతికి-14 సంవత్సరాలు నిండిపోయాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 100 ప్రశ్నలకుగాను 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు. 6వ తరగతికి (తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్&సోషల్(ఈవీఎస్), ఇంగ్లిష్) నుంచి మిగతా తరగతులవారికి (ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు.
పరీక్ష ఫీజు: రూ.200. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 09.01.2023
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.01.2023
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.02.2023 (ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు)
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 08.04.2023.
➥ పరీక్ష తేదీ: 16.04.2023.
పరీక్ష సమయం:
➥ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి,
➥ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతికి పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రం: అభ్యర్థులు వారివారి మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
➥ ఎంపిక జాబితా వెల్లడి: 24.05.2023
➥ సర్టిఫికేట్ల పరిశీలన, ప్రవేశాలు: 25.05.2023 - 31.05.2023 వరకు.
➥ తరగతులు ప్రారంభం: 01.06.2023.
నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
Also Read:
తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
తెలంగాణలోని గిరిజన (ఎస్టీ) గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 'తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023' విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. వీరికి ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
ప్రవేశ ప్రకటన, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో 2023-2024 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం రాష్ట్ర మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) నోటిఫికేన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 204 మైనార్టీ పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 107 బాలుర పాఠశాలలు ఉండగా, 97 బాలికల పాఠశాలలు ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!