Inter Exam Fee: నేటితో ముగియనున్న ‘ఇంటర్‌’ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు, పరీక్షల షెడ్యూలు ఇలా

TSBIE: తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు మే 16తో ముగియనుంది. విద్యార్థులు రూ.1000 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Continues below advertisement

TS Intermediate Supplementary Exam Fee Last Date: తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు మే 16తో ముగియనుంది. విద్యార్థులు రూ.1000 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఫీజు చెల్లించనివారు ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతిఓజా ఒక ప్రకటనలో తెలిపారు సూచించారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.460, ప్రాక్టికల్స్‌కు రూ.170, బ్రిడ్జి కోర్సులకు రూ.120 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం పరీక్ష ఫీజుతో పాటు ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకుంటే.. సైన్స్‌ విద్యార్థులు రూ.1200, ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది. 

Continues below advertisement

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 24 నుంచి జూన్ 3 వరకు ఇంట‌ర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఇంట‌ర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు ఇంట‌ర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించ‌నున్నారు. 

విద్యార్థులకు జూన్ 4 నుంచి 8 వ‌ర‌కు ఇంటర్ ప్రాక్టిక‌ల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జూన్ 10న ఇంగ్లిష్ ప్రాక్టిక‌ల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి పరీక్ష నిర్వహిస్తారు. ఇక జూన్ 11న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేష‌న్ ఎగ్జామ్, జూన్ 12న ఎథిక్స్ అండ్ హ్యుమ‌న్ వాల్యూస్ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఆయా తేదీల్లో ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు పరీక్షలు జరుగనున్నాయి. 

ఇంటర్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ మే 24 (శుక్రవారం): సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్-1.

➥ మే 25 (శనివారం): ఇంగ్లిష్ పేప‌ర్-1.

➥ మే 28 (మంగళవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-1ఎ, బోట‌ని పేప‌ర్-1, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్-1.

➥ మే 29 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-1బి, జువాల‌జీ పేప‌ర్-1, హిస్టరీ పేప‌ర్-1.

➥ మే 30 (గురువారం): ఫిజిక్స్ పేప‌ర్-1, ఎకాన‌మిక్స్ పేప‌ర్-1.

➥ మే 31 (శుక్రవారం): కెమిస్ట్రీ పేప‌ర్-1, కామ‌ర్స్ పేప‌ర్-1.

➥ జూన్ 1 (శనివారం): ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-1 (బైపీసీ విద్యార్థులకు).

➥ జూన్ 3 (సోమవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్-1, జియోగ్రఫీ పేప‌ర్-1.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..

➥ మే 24 (శుక్రవారం): సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్-2.

➥ మే 25 (శనివారం): ఇంగ్లిష్ పేప‌ర్-2.

➥ మే 28 (మంగళవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-2ఎ, బోట‌ని పేప‌ర్-2, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్-2.

➥ మే 29 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-2బి, జువాల‌జీ పేప‌ర్-2, హిస్టరీ పేప‌ర్-2.

➥ మే 30 (గురువారం): ఫిజిక్స్ పేప‌ర్-2, ఎకాన‌మిక్స్ పేప‌ర్-2.

➥ మే 31 (శుక్రవారం): కెమిస్ట్రీ పేప‌ర్-2, కామ‌ర్స్ పేప‌ర్-2.

➥ జూన్ 1 (శనివారం): ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-2 (బైపీసీ విద్యార్థులకు).

➥ జూన్ 3 (సోమవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్-2, జియోగ్రఫీ పేప‌ర్-2.

VOCATIONAL SECOND YEAR TIME TABLE IPASE MAY 2024

VOCATIONAL TIMETABLE FIRST YEAR IPASE MAY 2024

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola