TS Intermediate Exams Time Table: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ తాజాగా విడుదల చేసింది. 2023 మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 15న ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, మార్చి 16న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని బోర్డ్ వెల్లడించింది. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ మార్చి 15న మొదలు కాగా, ఏప్రిల్ 3న ముగియనున్నాయి. సెకండియర్ ఎగ్జామ్స్  మార్చి 16న మొదలుకాగా, ఏప్రిల్ 4న ముగుస్తాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది.




ఇంట‌ర్‌ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు :



  • మార్చి 15 - బుధవారం - 2nd లంగ్వేజ్ పేపర్ 1

  • మార్చి 17 - శుక్రవారం - ఇంగ్లీష్ పేపర్ 1

  • మార్చి 20 - సోమవారం - మ్యాథ్స్‌ పేపర్‌ 1ఎ, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1

  • మార్చి 23 - గురువారం - మ్యాథ్స్ 1బి, హిస్టరీ పేపర్ 1, జువాలజీ పేపర్ 1

  • మార్చి 25 - శనివారం - ఫిజిక్స్ పేపర్ 1, ఎకనావిుక్స్‌ పేపర్ 1

  • మార్చి 28 - మంగళవారం - కెవిుస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1

  • మార్చి 31 - శుక్రవారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్ 1 (బైపీసీ విద్యార్థులకు)

  • ఏప్రిల్ 3 - సోమవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1


ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ :



  • మార్చి 16 - గురువారం - సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్ 2

  • మార్చి 18 - శనివారం - ఇంగ్లీష్‌ పేపర్ 2

  • మార్చి 21 - మంగళవారం - మ్యాథ్స్‌ పేపర్‌ 2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్‌ 2

  • మార్చి 24 - శుక్రవారం - మ్యాథ్స్ పేసర్ 2బి, హిస్టరీ పేపర్‌ 2, జువాలజీ పేపర్‌ 2

  • మార్చి 27 - సోమవారం - ఫిజిక్స్ పేపర్‌ 2, ఎకనావిుక్స్‌ పేపర్‌ 2

  • మార్చి 29 - బుధవారం - కెవిుస్ట్రీ పేపర్‌ 2, కామర్స్ పేపర్‌ 2

  • ఏప్రిల్ 1 - శనివారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్‌ 2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్‌ 2 (బైపీసీ విద్యార్థులకు)

  • ఏప్రిల్ 4 - మంగళవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్‌ 2, జియోగ్రఫీ పేపర్‌ 2