తెలంగాణలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్-2023 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28న వర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య టి.రమేశ్, కన్వీనర్ ఆచార్య పి.వరలక్ష్మి, రిజిస్ట్రార్ ఆచార్య టి.శ్రీనివాసరావు ఐసెట్ షెడ్యూలును వెల్లడించారు. కేయూ ఇప్పటివరకు 13సార్లు ఐసెట్‌ను సమర్థంగా నిర్వహించిందని లింబాద్రి పేర్కొన్నారు. మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి ఫలితాల ప్రకటన వరకు అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుందని లింబాద్రి చెప్పారు.
ఐసెట్ షెడ్యూలు ఇలా..
➥ టీఎస్ ఐసెట్-2023 దరఖాస్తు ప్రక్రియ మార్చి 6 నుంచి ప్రారంభంకానుంది. మే 6 వరకు కొనసాగనుంది.
➥ విద్యార్థులు రూ.250 ఆలస్య రుసుముతో మే 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
➥ దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు మే 12 నుంచి 18 వరకు అవకాశం కల్పించనున్నారు.
➥ మే 22 నుంచి ఐసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
➥ రాష్ట్రవ్యాప్తంగా 75 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
➥ జూన్ 5న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఆన్సర్ కీపై జూన్ 8న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.
➥ జూన్ 20న ఫైనల్ కీతో పాటు ఫలితాలను విడుదల చేయనున్నారు.
Also Read:
తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 1న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మీతో కలిసి ఆయన విడుదల చేశారు. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజీఎల్ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న పరీక్ష నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
టీఎస్ ఎంసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!
టీఎస్ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్ ఫిబ్రవరి 28న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మహాత్మాజ్యోతిబాపులే ఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్-2023 నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) రాష్ట్రంలోని వివిధ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్‌లో ప్రవేశాలకు పదోతరగతి, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్ అర్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..