డిప్లొమా విద్యార్థులకు బీటెక్‌లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించిన ఈసెట్ (TS ECET)-2022 వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 7న ప్రారంభమైంది. ఈసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబరు 7 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్‌కు ముందు అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓబీ, బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులు రూ.600 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ONLINE SLOT BOOKING FOR CERTIFICATE VERIFICATION
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 7 నుంచి స్లాట్లు బుకింగ్, సెప్టెంబర్ 9 నుంచి 12 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, సెప్టెంబరు 9 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. సెప్టెంబరు 17న సీట్ల కేటాయింపు ఉంటుంది. మొదటి విడుతలో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 22వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి తుది విడుత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 29న సీట్లు కేటాయించనున్నారు. అక్టోబర్ 10 లోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.
TS ECET - 2022 RANK CARD
ఈ ఏడాది టీఎస్‌ఈసెట్-2022 పరీక్షను ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష కోసం తెలంగాణ, ఏపీల్లో కలిపి 24,055 మంది దరఖాస్తు చేసుకోగా 22,001 (91.46శాతం)మంది విద్యార్థులు హాజరయ్యారు. టీఎస్‌ఈసెట్ ప్రాథమిక 'కీ'ని ఆగస్టు 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరించారు. దీంతో ఆగస్టు 12న ఫలితాలను వెల్లడించారు. ఈసెట్ ఫలితాల్లో 90.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
Also Read:
APRCET-2022: ఏపీఆర్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాలు ఇలా!
ఏపీలోని 16 యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్(ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాల కోసం నిర్వహించే APRCET-2022 (ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)-2022 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 01న ప్రారంభమైంది. 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. ఏపీఆర్‌సెట్ పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 62 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
BRAOU: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 15 వరకు అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే ఒకసారి దరఖాస్తు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులు అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..