తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్‌-2023 షెడ్యూలును తెలంగాణ ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 24న విడుదలచేసింది. షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 28న ఎంసెట్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో మే 7 నుంచి 9 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి; మే 10 నుంచి 11 వరకు అగ్రికల్చర్‌, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 30 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.


ఎంసెట్‌ షెడ్యూల్‌ ఇలా..


ఎంసెట్‌ నోటిఫికేషన్‌ వెల్లడి:  28.02.2023


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.


దరఖాస్తుకు చివరితేదీ (అపరాధ రుసుము లేకుండా): 10.04.2023. 


➥ రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.04.2023.


రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 20.04.2023.


➥ రూ.2500 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 25.04.2023.


రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 02.05.2023.


➥ దరఖాస్తు ఫీజు: రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600


హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 30.04.2023 నుంచి


➥ పరీక్ష తేదీలు:  మే 7 నుంచి 11 వరకు (మే 7 - 9 వరకు ఇంజినీరింగ్, మే 10, 11 తేదీల్లో ఫార్మసీ, అగ్రికల్చర్).


Website


సెషన్‌కు 40 వేల మంది..
ప్రస్తుతం ఎంసెట్‌లో ఒక్కో సెషన్‌కు 29 వేల మంది విద్యార్థుల వరకు ఆన్‌లైన్‌లో ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను 40 వేలకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశంపై టీసీఎస్‌ అయాన్‌ సంస్థతో జేఎన్టీయూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎంసెట్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయడం, ప్రశ్నపత్రాల నార్మలైజేషన్‌ సమస్యను అధిగమించేందుకు ఈ ఏడాది తక్కువ సెషన్లలో పరీక్షల నిర్వహణకు యోచిస్తున్నారు. ఏటా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులు ఎంసెట్‌కు హాజరవుతున్నారు. ఒక్కో సెషన్‌కు 40 వేల మంది విద్యార్థులు హాజరైతే ఎంసెట్‌ పరీక్షలను ఐదు రోజుల్లోనే ముగించవచ్చనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.


Also Read:


JNTUH Courses: జేఎన్టీయూలో కొత్త కోర్సులు వస్తున్నాయ్‌! ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
రానున్న విద్యాసంవత్సరంలో సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు జేఎన్‌టీయూహెచ్ కసరత్తు చేస్తుంది. యూనివర్సిటీ పరిధిలో కొత్తగా అగ్రికల్చర్‌ టెక్నాలజీ, రేడియేషన్‌ ఫిజిక్స్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వ్యవసాయ యాంత్రీకరణకు పరిశ్రమలను ప్రోత్సహించడమేగాక ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అగ్రికల్చర్‌ టెక్నాలజీ కోర్సుకు రూపకల్పన చేసింది. దీంతోపాటు రేడియేషన్‌ ఫిజిక్స్‌ కోర్సును ప్రవేశపెట్టాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఒకటో తరగతి ప్రవేశాలపై కీలక నిర్ణయం! రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖలు!
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది. నూతన విద్యావిధానం ప్రకారం విద్యార్థులకు పునాది దశలో అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో మొదటి మూడేళ్ల పాటు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, రెండేళ్లపాటు ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..