TS EAMCET 2021 Final Phase Seat Allotment: తెలంగాణలో ఇంజి‌నీ‌రింగ్‌ కోర్సుల్లో ప్రవే‌శాల కోసం నిర్వహించిన ఎంసెట్‌ 2021 తుది‌వి‌డ‌త‌ కౌన్సెలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ సీట్ల భర్తీ కోసం ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్.. స్లాట్ బుకింగ్ జరగగా.. తుది విడత సీట్ల కేటాయింపు చేశారు. విద్యార్థులు తమ వివరాలతో లాగిన్ అయ్యి కాలేజీల వివరాలు చెక్ చేసుకోవాలని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. 


అదే విధంగా అభ్యర్థులు ఫీజు ఆన్ లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని విద్యార్థులకు సూచించారు. నేటి నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ట్యూషన్‌ ఫీజు చెల్లించాలని, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని తెలిపారు. నవంబర్ 17 వరకు విద్యార్థులు జాయినింగ్ వివరాలు ఆన్‌లైన్లో అప్‌డేట్ చేసుకోవాలి. తుది విడత కౌన్సెలింగ్‌లో వచ్చిన సీట్లు రద్దు చేసుకోవడానికి నవంబర్ 18వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు కన్వీనర్ వెల్లడించారు. 
కాలేజీ సీట్ల కేటాయింపు వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ లింక్ క్లిక్ చేయండి https://tseamcet.nic.in/college_allotment.aspx 


నవంబర్ 20 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌
ఈనెల 20 నుంచి ప్రత్యేక విడత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్ 20, 21 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునే అభ్యర్థులకు.. నవంబర్ 24న తుది విడతగా ఇంజినీరింగ్ కాలేజీలలో సీట్లు కేటాయిస్తారు. స్పెషల్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 24 నుంచి 26 వరకు ఆన్‌లైన్ లో ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 26 వరకు విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.
Also Read: ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


సీట్ల కేటాయింపు ఇలా చెక్ చేసుకోవాలి..
1. అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ tseamcet.nic.in వెబ్‌లింక్ ఓపెన్ చేయండి 
2. అందులో Candidates Login ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలి 
3. లాగిన్ ఐడీ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పాస్‌వర్డ్ లాంటి వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి
4. వివరాలు సబ్మిట్ చేసిన తరువాత మీ కాలేజీ, సీటు వివరాలు కనిపిస్తాయి. ఆ వివరాలు డౌన్ లోడ్ చేసుకుంటే అలాట్‌మెంట్ ఆర్డర్ పొందినట్లే.
5. అలాట్‌మెంట్ ఆర్డర్ ప్రింటౌట్ తీసుకోవాలి. కాలేజీలో చేరే సమయంలో అలాట్‌మెంట్ వివరాలు అందజేయాలి


లేదా  https://tseamcet.nic.in/cand_signin.aspx ఈ లింక్ మీద క్లిక్ చేసి అభ్యర్థి లాగిన్ వివరాలు ఎంటర్ చేసి అలాట్‌మెంట్ ఆర్డర్ ప్రింటౌట్ తీసుకోవాలి. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి