CPGET 2022: తెలంగాణలోని యూనివర్సిటీలలో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీజీఈటీ – 2022 ఫలితాలను మంగళవారం (సెప్టెంబరు 20) విడుదల చేయనున్నారు. ఈ మేరకు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి సెప్టెంబరు19న ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు కన్వీనర్ తెలిపారు. ఈ ఏడాది సీపీగెట్ పరీక్షలను ఆగస్టు 11 నుంచి 23 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 67,027 మంది దరఖాస్తు చేసుకోగా.. 57,262 మంది హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్) -2022’ జూన్‌లో నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జూన్ 6 నుంచి జులై 4 వరకు, ఆలస్య రుసుముతో జులై 15 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. పరీక్షల షెడ్యూలును జులై 29న విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం ఆగస్టు 11 నుంచి 22 వరకు సీపీగెట్ పరీక్షలు నిర్వహించారు.
మొత్తం 84 సబ్జెక్టులకు రాష్ట్రంలోని 12 జోన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు 11 నుంచి 23 వరకు సబ్జెక్టులవారీగా పరీక్షలు నిర్వహించారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మొత్తం 50 కోర్సుల్లో 112 విభాగాలకు విద్యార్థులు ప్రవేశాలు పొందే వీలుంది. ప్రవేశ పరీక్షలో ర్యాంకును బట్టి తెలంగాణలోని యూనివర్సిటీల పరిధిలో ఉన్న 320 కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా కోర్సులు, ఇంటిగ్రేటెడ్ కోర్సులు.
ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) లు సీపీజీఈటీ 2021 ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.
Also Read:
ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యతేదీలివే!
తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సెప్టెంబరు 19న విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్ 10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఐసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అక్టోబర్ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. ఇక వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అక్టోబరు 18న ఎంబీఏ, ఎంసీఏ అభ్యర్థులకు మొదటి విడుదల సీట్లు కేటాయించనున్నారు.
ఐసెట్ పూర్తి కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
Also Read:
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..