CAT 2023: క్యాట్‌-2023 పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు, గతేడాది కంటే 31 శాతం అధికం

దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లలో ప్రవేశాలకు వీలు కల్పించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2023 ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు.

Continues below advertisement

దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లలో ప్రవేశాలకు వీలు కల్పించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2023 ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు. నవంబరు 26న జరిగే పరీక్షకు మొత్తం సుమారు 3.30 లక్షల మంది పోటీపడనున్నారు. గతేడాదితో పోల్చుకుంటే 31 శాతం పెరగడం విశేషం. ఈసారి మొత్తం అభ్యర్థుల్లో 1.17 లక్షల మంది అమ్మాయిలున్నారు.  క్యాట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ ప్రక్రియ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 26 వరకు ఉంటుంది. నవంబర్ 26న క్యాట్ పరీక్షను మూడు సెషన్లలో నిర్వహించనున్నారు. 2024 జనవరి రెండో వారంలో పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి పరీక్షను ఐఐఎం లక్నో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Continues below advertisement

ఐఐఎం క్యాంపస్‌లు ఇవే.. 
క్యాట్ 2023 పరీక్ష ద్వారా విశాఖపట్నం, అహ్మాదాబాద్, బెంగళూరు, కలకతా, జమ్మూ, బోద్ గయ, ఉదయపూర్, తిరుచిరాపల్లి, కోజికాడ్, అమృత్‌సర్, రాయ్‌పూర్, నాగ్‌పూర్, కాశీపూర్, లక్‌నవూ, రాంచీ, రోహ్‌తక్, షిల్లాంగ్, ఇండోర్, సంబాల్‌పూర్, సిర్‌మౌర్ ఐఐఎం క్యాంపస్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. 

పరీక్ష ఇలా..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2 గంటలపాటు సాగనుంది. పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటి నుంచి 66 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాల సమయం చొప్పున 120 నిమిషాల సమయం ఉంటుంది. దివ్యాంగులకు 13 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తారు. ప్రతిప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. క్యాంట్ స్కోరుకు 2023 డిసెంబరు 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 

సెక్షన్-1: వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రహెన్షన్ -  24 ప్రశ్నలు – 72 మార్కులు

సెక్షన్-2: డేటా ఇంటర్ ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్ - 20 ప్రశ్నలు – 60 మార్కులు

సెక్షన్-3: క్వాంటిటేటివ్ ఎబిలిటీ - 20 ప్రశ్నలు – 60 మార్కులు.

CAT 2023 Information Bulletin

Scoring and Equating Process

ALSO READ:

ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్‌ ఆప్షన్లు
ఏపీలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబరు 27 నుంచి వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పంచారు. విద్యార్థులు సెప్టెంబ‌రు 27 నుంచి 30 వరకు మొదటి విడత వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్స ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 5 నుంచి 7 వరకు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. యూనివర్సిటీ పరిధిలో బీఎస్సీ అగ్రికల్చర్‌లో 1062 సీట్లు, బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో 55 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

వరంగల్‌ నిట్‌లో బీఎస్సీ- బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు, అర్హతలివే!
వరంగల్‌‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 2023-24 విద్యాసంవత్సరానికిగాను నాలుగేళ్ల బీఎస్సీ-బీఈడీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీఎస్సీ, బీఈడీ మిళితం చేసే ఇంటిగ్రేటెడ్‌ పాఠ్యాంశాలు కోర్సులో ఉంటాయి. అక్టోబర్‌లో కోర్సు ప్రారంభం కానుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Continues below advertisement
Sponsored Links by Taboola