Telangana TS Inter Board Exams Dates 2026 : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) 2026 మార్చి సెషన్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (IPE) తేదీలను అధికారికంగా ప్రకటించింది. మొదటి సంవత్సరం విద్యార్థుల పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17, 2026 వరకు, రెండో సంవత్సరం విద్యార్థులది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు జరుగనున్నాయి. పూర్తి టైమ్‌టేబుల్‌ను అధికారిక వెబ్‌సైట్  tgbie.cgg.gov.in లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Continues below advertisement


ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 (సోమవారం) నుంచి ఫిబ్రవరి 21 (శనివారం) వరకు (ఆదివారాలు సహా) రెండు సెషన్లలో జరుగనున్నాయి.  మార్నింగ్ సెషన్ 9 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అఫ్టర్‌నూన్ సెషన్ మధ్యాహ్నం 2 గంటలు నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.  ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ మొదటి సంవత్సరం జనవరి 21, రెండో సంవత్సరం జనవరి 22న జరుగనున్నాయి. ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ (జనవరి 23), ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (జనవరి 24) ప్రాక్టికల్స్ ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. JEE-మెయిన్స్ 2026తో క్లాష్ అయితే ప్రత్యామ్నాయ వ్యవస్థలు చేస్తారు.


సబ్జెక్టు వారీ టైమ్‌టేబుల్ (థియరీ పరీక్షలు: ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు)


 
విద్యార్థులు అధికారిక సైట్‌లో టైమ్‌టేబుల్, హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.