తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల షెడ్యూలును అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్ టేబుల్‌ను అందుబాటులో ఉంచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 16 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్; మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక అక్టోబరు 30 నుంచి నవంబరు 6 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 16.10.2023
ఉదయం సెషన్: తెలుగు/కన్నడ/తమిళం/మరాఠి.
మధ్యాహ్నం సెషన్: సైకాలజీ.
➥ 17.10.2023
ఉదయం సెషన్: ఇంగ్లిష్.
మధ్యాహ్నం సెషన్: ఇండియన్ కల్చర్ & హెరిటేజ్.
➥ 18.10.2023
ఉదయం సెషన్: మ్యాథమెటిక్స్.
మధ్యాహ్నం సెషన్: బిజినెస్ స్టడీస్.
➥ 19.10.2023
ఉదయం సెషన్: సైన్స్ & టెక్నాలజీ.
మధ్యాహ్నం సెషన్: హిందీ.
➥ 20.10.2023
ఉదయం సెషన్: సోషల్ స్టడీస్.
మధ్యాహ్నం సెషన్: ఉర్దూ.
➥ 21.10.2023
ఉదయం సెషన్: ఎకనామిక్స్.
మధ్యాహ్నం సెషన్:హోంసైన్స్.
➥ 26.10.2023
ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు.
మధ్యాహ్నం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (ప్రాక్టికల్స్)
ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 16.10.2023
ఉదయం సెషన్: తెలుగు/ఉర్దూ/హిందీ.
మధ్యాహ్నం సెషన్: హోంసైన్స్, అరబిక్.
➥ 17.10.2023
ఉదయం సెషన్: ఇంగ్లిష్.
మధ్యాహ్నం సెషన్:మాస్ కమ్యూనికేషన్, కెమిస్ట్రీ.
➥ 18.10.2023
ఉదయం సెషన్: పొలిటికల్ సైన్స్.
మధ్యాహ్నం సెషన్: పెయింటింగ్, జియెగ్రఫీ.
➥ 19.10.2023
ఉదయం సెషన్: హిస్టరీ.
మధ్యాహ్నం సెషన్: సైకాలజీ, ఫిజిక్స్.
➥ 20.10.2023
ఉదయం సెషన్: కామర్స్/బిజినెస్ స్టడీస్.
మధ్యాహ్నం సెషన్: మ్యాథమెటిక్స్.
➥ 21.10.2023
ఉదయం సెషన్: బయాలజీ, ఎకనామిక్స్.
మధ్యాహ్నం సెషన్: అకౌంటెన్సీ, సోషియాలజీ.
➥ 26.10.2023
ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (థియరీ).
మధ్యాహ్నం సెషన్: ఎలాంటి పరీక్ష లేదు.
ప్రాక్టికల్ పరీక్షలు..
జనరల్ & వొకేషనరల్ సబ్జెక్టులు: 30.10.2023 - 06.11.2023.
ALSO READ:
JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!
దేశవ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో 11వ తరగతిలో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లావాసి అయి ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..
JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!
దేశవ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో 9వ తరగతిలో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లావాసి అయి ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..