Inter Colleges Affiliation: తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏప్రిల్ 3న నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని కాలేజీలు షెడ్యూల్‌ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఏప్రిల్ 4న ఒక ప్రకటనలో తెలిపారు. కాలేజీలు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు పొందాకే నడపాల్సి ఉంటుంది. కొత్త కాలేజీల ఏర్పాటుకు అనుమతితోపాటు, ఇప్పటికే నడుస్తున్న కాలేజీలకు గుర్తింపును ఇవ్వడంతోపాటు, వీటిల్లో అదనపు సెక్షన్లకు ఏటా అనుబంధ గుర్తింపును పునరుద్ధరిస్తుంటారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యే నాటికి అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ ముగియాల్సి ఉంటుంది. 

ఆలస్య రుసుములో జూన్ 8 వరకు అవకాశం..సంబంధిత కళాశాలల యాజమాన్యాలు ఏప్రిల్ 5 నుంచి మే 4 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆలస్య రుసుంతో జూన్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టంచేశారు. అయితే గృహ, వాణిజ్య సముదాయాల పరిధిలో నడుస్తున్న 217 ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై నిర్ణయాన్ని ప్రకటించలేదు. కళాశాల భవన రిజిస్ట్రేషన్‌ డీడ్‌ లేదా లీజు డీడ్‌, అప్రూవ్డ్‌ బిల్డింగ్‌ ప్లాన్‌, ఫైర్‌ సేఫ్టీ ఎన్‌వోసీ, కార్పస్‌ ఫండ్‌, స్ట్రక్చరల్‌ సౌండ్‌నెస్‌ సర్టిఫికెట్‌, శానిటరీ సర్టిఫికెట్‌, బోధనా సిబ్బంది డాక్యుమెంట్లు, ఆటస్థలం డాక్యుమెంట్లను దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు సమయంలో అవసరమయ్యే సర్టిఫికేట్లు..➥ వ్యాలీడ్ బిల్డింగ్ ఓనర్‌షిప్/రిజిస్టర్డ్ లీజ్ డీడ్ ఆఫ్ కాలేజ్ బిల్డింగ్➥ బిల్డింగ్ ప్లానింగ్ అప్రూవల్ సర్టిఫికేట్➥ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్/ ఫైర్ NOC➥ వ్యాలీడ్ ఎఫ్‌డీఆర్ (కార్పస్ ఫండ్)➥ స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికేట్➥ శానిటరీ సర్టిఫికేట్➥ టీచింగ్ స్టాఫ్ డాక్యుమెంట్లు➥ ప్లే గ్రౌండ్ సంబంధిత డాక్యుమెంట్లు

Affiliation Notification for the Academic year 2025 to 2026

ముఖ్యమైన తేదీలు..

➥ ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు అవకాశం: 04.05.2025.

➥ రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 11.05.2025.

➥ రూ.5,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 18.05.2025.

➥ రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 25.05.2025.

➥ రూ.15,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 01.06.2025.

➥ రూ.20,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 08.06.2025.

అకడమిక్ క్యాలెండర్ విడుదల..తెలంగాణలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి జూనియర్‌ కాలేజీల అకడ‌మిక్ క్యాలెండ‌ర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పనిదినాలు, తరగతులు, సెలవులు, పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఏప్రిల్ 3న కొత్త అకడ‌మిక్ క్యాలెండ‌ర్‌ను విడుదల చేశారు. దీనిప్రకారం.. వ‌చ్చే విద్యాసంవ‌త్సరం మొత్తం 226 పనిదినాలుగా ఇంట‌ర్ బోర్డు నిర్ణయించింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 2 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. 2026 మార్చి 31 తేదీని విద్యాసంవత్సరం చివరి పనిదినంగా నిర్ణయించారు. ఇంటర్ విద్యార్థులకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5 వరకు దసరా సెలువులు ఇవ్వనున్నారు. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 6న కాలేజీలు పునఃప్రారంభంకానున్నాయి. అదేవిధంగా.. వచ్చే ఏడాది(2026) జనవరి 11 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 

Academic Calendar for the Academic year 2025 to 2026

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్..➥ ఇంటర్మీడియేట్ తరగతులు ప్రారంభం: 02.06.2025.

➥ దసరా సెలవులు: 28.09.2025 - 05.10.2025.

➥ అర్థ సంవత్సరం పరీక్షలు: 10.11.2025 - 15.11.2025.

➥ సంక్రాంతి సెలవులు: 11.01.2026 - 18.01.2026.

➥ ప్రీ ఫైనల్ పరీక్షలు: 19.01.2026 - 24.01.2026.

➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2026, ఫిబ్రవరి మొదటి వారంలో.

➥ ఇంటర్ వార్షిక పరీక్షలు: 2026 మార్చి మొదటి వారంలో

➥ విద్యాసంవత్సరం చివరి పనిదినం: 31.03.2026.

➥ వేసవి సెలవులు: 01.04.2026 - 31.05.2026. 

➥ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2026, మే చివరి వారంలో. 

➥ జూనియర్ కాలేజీల పునః ప్రారంభం: 01.06.2026.