తెలంగాణలో పదో తరగతి విద్యార్ధులు పరీక్షా ఫలితాల గురించి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షా ఫలితాలు రేపు (మే 9) విడుదల కానుండగా, పదో తరగతి పరీక్షల ఫలితాలు రిలీజ్ కు మాత్రం ఇంకో వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని, ఫలితాల ప్రాసెసింగ్ చివరి దశలో ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నారు. ఇంకో వారం రోజుల్లో ఫలితాలు వెల్లడికావచ్చని తెలుస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 


ఇక తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. పది పరీక్షలకు 7,39,493 మంది విద్యార్ధులు హాజరయ్యారు.