TSWRES Sainik School Inter Admissions: తెలంగాణ-కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సైనిక పాఠశాలను ప్రత్యేకంగా బాలుర కోసం ఏర్పాటుచేశారు. 0వ తరగతి ఉత్తీర్ణులైన లేదా ఈ ఏడాది పరీక్షలకు హాజరవుతున్న బాలురు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలు గల బాలురు ఆన్‌లైన్ ద్వారా మార్చి 1 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులకు మార్చి 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.
వివరాలు..
🔰 సైనిక పాఠశాల - ఇంటర్(ఎంపీసీ) ప్రవేశాలు
సీట్ల సంఖ్య: 46.
సీట్ల కేటాయింపు: ఎస్సీ- 60, బీసీ (సి)- 02, ఎస్టీ- 05, బీసీ- 10, మైనార్టీ- 02, ఓసీ/ ఈబీసీ- 01 సీట్లు కేటాయించారు.
అర్హతలు: 2023-24 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులైన లేదా ఈ ఏడాది పరీక్షలకు హాజరవుతున్న బాలురు దరఖాస్తుకు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000; గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000కు మించకూడదు. విద్యార్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.04.2024 నాటికి 16 సంవత్సరాలకు మించకూడదు. 01.04.2008 నుంచి 31.03.2010 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక ప్రక్రియ: మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో 100 మార్కులకు రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష, రెండో దశలో 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాతి దశలో ఫిజికల్, సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ (డిస్క్రిప్టివ్), కమ్యూనికేషన్ స్కిల్ టెస్టు, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.200.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.03.2024.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 06.03.2024 నుంచి.
➥ ప్రవేశ పరీక్షతేది: 10.03.2024.
➥ రాత పరీక్ష ఫలితాల వెల్లడి: తర్వాత తెలియజేస్తారు.
➥ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తేదీలు: ఏప్రిల్ 1, 3, 4, 6 తేదీల్లో.
➥ తుది ఫలితాల వెల్లడి: తర్వాత తెలియజేస్తారు.
➥ పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభం: షెడ్యూలు ప్రకారం.
Notification
Online Payment
Online Application
Website
ALSO READ:
TS EAPCET-2024 నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న 'టీఎస్ ఈఏపీసెట్-2024' నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ-హైదరాబాద్ ఫిబ్రవరి 21న విడుదల చేసింది. ఈ ఏడాది ఇంటర్ పరక్షలకు హాజరవుతున్నవారు, ఇంటర్ అర్హత ఉన్న విద్యార్థులు ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రూ.250 ఆలస్య రుసుమతో ఏప్రిల్ 9 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 వరకు, రూ.5000 ఆలస్య రుసుముతో మే 4 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఏప్రిల్ 8 నుంచి 12 వరకు ఎడిట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తమ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..