Telangana Model Schools Admissions: తెలంగాణలోని 194 ఆదర్శపాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 6వ తరగతి నుంచి 10వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి జనవరి 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. విద్యార్థుల నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం (డిసెంబరు 20) షెడ్యూలు విడుదల చేసింది.


23 నోటిఫికేషన్..
మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు డిసెంబరు 23న నోటిఫికేషన్ జారీ కానుంది. దరఖాస్తు చేసుకున్నవారికి వచ్చే ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా స్కూళ్లల్లో 6వ తరగతిలో అన్నీ సీట్లకు ప్రవేశాలు ఉంటాయని, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రం ఖాళీలు ఉంటేనే భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులు రూ.125, ఓసీలు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తి ఉన్నవారు ద్వారా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.


* మోడల్‌ స్కూల్స్ ప్రవేశాలు - 2024


ప్రవేశాలు కల్పించే తరగతులు: 6, 7, 8, 9, 10.


వయోపరిమితి: 6వ తరగతికి-10 సంవత్సరాలు, 7వ తరగతికి-11 సంవత్సరాలు, 8వ తరగతికి-12 సంవత్సరాలు, 9వ తరగతికి-13 సంవత్సరాలు, 10వ తరగతికి-14 సంవత్సరాలు నిండిపోయాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.


పరీక్ష విధానం: మొత్తం 100 ప్రశ్నలకుగాను 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు. 6వ తరగతికి (తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్&సోషల్(ఈవీఎస్), ఇంగ్లిష్) నుంచి మిగతా తరగతులవారికి (ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు.



పరీక్ష ఫీజు: రూ.200. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.


పరీక్ష కేంద్రం: అభ్యర్థులు వారివారి మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


➥ నోటిఫికేషన్ వెల్లడి: 23.12.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.01.2025.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.02.2025.


➥ పరీక్ష తేదీ: 13.04.2025.


పరీక్ష సమయం:


➥ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి, 


➥ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతికి పరీక్షలు నిర్వహిస్తారు.


WEBSITE


ALSO READ:


తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఎస్ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...