TG Law CET Results 2025: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) మధ్యాహ్నం 4 గంటలకు టీజీ లాసెట్ (TS LAWCET),  పీజీ లాసెట్ (PGLCET) 2025 ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు lawcet.tgche.ac.inలో ఉంచారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఎలా తెలుసుకోవాలి, ర్యాంకు కార్డుల ఎలా డౌన్‌లోడ్ చేయాలో ఇక్కడ చూద్దాం.   

అధికారులు విడుదల చేసిన లాసెట్‌ ఫలితాల్లో ర్యాంకు వివరాలు ఉన్నాయి. ఏ విభాగంలో ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలిపారు. 

ఫలితాలు తెలుసుకునేందుకు అనుసరించాల్సిన స్టెప్ట్స్

  • ముందు ఈ ఫలితాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ lawcet.tgche.ac.inను సందర్శించాలి.  
  • అక్కడ లేటెస్ట్ అప్‌డేట్స్ వద్ద రిజల్ట్స్‌ అనే లింక్ కనిపిస్తుంది.
  • అనంతరం మీకు వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. లేకుంటే ఈ(రిజల్ట్స్ లింకు ఇదే) లింకుపై క్లిక్ చేస్తే రిజల్ట్స్ పేజ్‌కు వెళ్తుంది
  • అందులో మీ రిజిస్ట్రేషన్, హాల్ టికెట్‌ నెంబర్ టైప్ చేయాలి.  
  • అనంతరం అక్కడ సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి. 
  • మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. 
  • తర్వాత ఆ ర్యాంకు కార్డును డౌన్‌లోడ్ చేసిపెట్టుకోవాలి. 
  • కౌన్సెలింగ్ టైంలో ఈ వివరాలు అవసరం అవుతాయి. 
  • టీఎస్ లాసెట్‌లో అర్హత సాధించడానికి అభ్యర్థులు 120 మార్కుల్లో కనీసం 35 శాతం మార్కులు అంటే 42 మార్కులు సాధించాలి.

ర్యాంకు కార్డ్ లో ఉన్న వివరాలేంటీ: ర్యాంకు కార్డ్‌లో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, సాధించిన మార్కులు, మొత్తం మార్కులు, అర్హత స్థాయి, ర్యాంకు వంటి వివరాలు ఉంటాయి.కౌన్సెలింగ్: ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 2025లో మొదలవుతుంది. ఈ ప్రక్రియలో సీటు కేటాయింపు , లా కోర్సులకు ప్రవేశం కోసం రిజిస్ట్రేషన్ అవసరం.

ఇతర ముఖ్యమైన విషయాలుఈ పరీక్ష జూన్ 6, 2025న ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించారు. దాదాపు 57,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, వీరిలో 45,609 మంది పరీక్షలో పాల్గొన్నారు.