Telangana Inter Results 2026 Download | తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బోర్డ్ అధికారిక ప్రకటన చేసింది. తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీజీబీఐఈ) నిర్వహించిన ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి. ఆదివారం ఉదయం 11:00 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. https://tgbie.in/result.html 

మార్చి 2026లో నిర్వహించిన జనరల్, వొకేషనల్ స్ట్రీమ్‌లలో రాసిన అభ్యర్థులందరి ఫలితాలను తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్  కె. కేశవ రావు, తెలంగాణ విద్యా శాఖ సెక్రటరీ, టీజీబీఐఈ వైస్ చైర్‌పర్సన్ యోగితా రానా హైదరాబాద్‌లోని టీజీబీఐఈ కార్యాలయంలో  విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రులు సౌలభ్యం కోసం అభ్యర్థులు సాధించిన మార్కులు వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచుతామని టీజీబీఐఈ తెలిపింది.  ఇంటర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

ఇంటర్నెట్ ద్వారా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు https://tgbie.cgg.gov.in , http://results.cgg.gov.in లలో చెక్ చేసుకోవాలని సూచించారు. ఫలితాలను అన్ని వార్తాపత్రికలు, ప్రింట్ మీడియాకు పెన్ డ్రైవ్‌ల ద్వారా అందజేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. విద్యార్థులు ఫలితాలు విడుదలైన వెంటనే పై వెబ్‌సైట్లలో తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి  మార్కులు చెక్ చేసుకోవాలని సూచించింది.

స్కోర్ కార్డును డౌన్‌ ఎలా చేసుకోవాలి?ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోంపేజిలో  TG Inter 1st Year Results 2026 లేదా TG Inter 2nd Year Results 2026 అనే కనిపించే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 

తర్వాత హాల్ టికెట్ నెంబర్‌, సంబంధిత అడిగిన వివరాలు ఎంటర్ చేయాలి. 

వివరాలు సరి చూసుకుని సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. 

మీ ఇంటర్ ఫలితాలు, స్కోర్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని పీడీఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి.