TS Inter Exam Centers: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షా కేంద్రాల సంఖ్య ఈ ఏడాది పెరిగింది. ప్రస్తుత కేంద్రాలకు అదనంగా మరో 32 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు (Intermediate Public Exams) హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరిగిన దృష్ట్యా పరీక్షాకేంద్రాలను (Inter Exam Centers) పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోల్చితే ఈసారి 30 వేలు అదనంగా పెరిగింది. గతేడాది ఇంటర్‌ పరీక్షలకు 1,480 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈ ఏడాది 1,512 పరీక్షాకేంద్రాలను సిద్ధం చేయనున్నారు. ఈ ఏడాది మొత్తం 10,59,233 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ఇప్పటివరకు 9,77,040 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. జనవరి 3 వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. విద్యార్థులు రూ.2,500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.


పరీక్షల షెడ్యూలు..
తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు డిసెంబరు 28న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌, ఫిబ్రవరి 29 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 17న ఎథిక్స్‌ & హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష, ఫిబ్రవరి 19న ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ రెగ్యులర్ పరీక్షలతోపాటు, ఒకేషనల్ పరీక్షలు కూడా ఫిబ్రవరి 28న ప్రారంభంకాన్నాయి. ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11 వరకు, ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12 వరకు జరుగనున్నాయి.  


ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ఫస్టియర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నారు. ఈ ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ థియరీ పరీక్షకు 80 మార్కులకు ఉండనుండగా.. ప్రాక్టికల్ పరీక్షకు 20 మార్కులు ఉండనున్నాయి.


ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు..


➥ 28-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I


➥ 01-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-I


➥ 04-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IA, బాటనీ పేపర్‌-I, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-I


➥ 06-03-2024: మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IB, జువాలజీ పేపర్‌-I, హిస్టరీ పేపర్‌-I


➥ 11-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-I, ఎకనామిక్స్‌ పేపర్‌-I


➥ 13-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-I, కామర్స్‌ పేపర్‌-I


➥ 15-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-I, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-I


➥ 18-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I, జియోగ్రఫీ పేపర్‌-I


ఇంటర్‌ సెకండ్‌ పరీక్షలు..


➥ 29-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II


➥ 02-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-II


➥ 05-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIA, బాటనీ పేపర్‌-II, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-II


➥ 07-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIB, జువాలజీ పేపర్‌-II, హిస్టరీ పేపర్‌-II


➥ 12-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-II, ఎకనామిక్స్‌ పేపర్‌-II


➥ 14-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-II, కామర్స్‌ పేపర్‌-II


➥ 16-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-II, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-II


➥ 19-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II, జియోగ్రఫీ పేపర్‌-II  


ఇంటర్ జనరల్, వొకేషనల్, బ్రిడ్జ్ కోర్సు పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..