Summer Holidays for Inter Colleges: తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. మార్చి 30వ తేదీ ఇంటర్ కాలేజీలకు ఈ విద్యాసంవత్సరానికి చివరి పనిదినంగా ప్రకటించింది. మార్చి 30 నుంచి మే 31 వరకు ఇంటర్ కళాశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు బోర్డు తెలిపింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను బేఖాతరు చేస్తూ కళాశాలలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. గతేడాది కూడా జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమైన సంగతి తెలిసిందే.


ఈసారి ముందుగానే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొద‌టి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షల ప్రక్రియ ముగియడంతో జవాబు పత్రాల మూల్యాంకనంపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభంకాగా.. పేప‌ర్ వాల్యూయేషన్ వేగంగా సాగుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా.. ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తిచేసి, ఫలితాలను కూడా త్వరగా విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నిస్తోంది. ఎంసెట్‫తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా వీలైనంత త్వరగా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని చూస్తోంది. వీలైతే ఏప్రిల్ రెండోవారం లేదా మూడోవారంలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


AP: ఆదర్శ పాఠశాలల్లో 'ఇంటర్‌' ప్రవేశాలు - మార్చి 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ


ఆంధ్రప్రదేశ్‌‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రవేశ ప్రక్రియకు సంబంధించి మార్చి 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పదోతరగతి అర్హత ఉన్న విద్యార్థుల నుంచి మార్చి 28 నుంచి మే 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ మార్చి 22న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు. విద్యార్థులు నిర్ణీత తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ కమిషనర్‌ సూచించారు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 200. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో సీట్లు పొందినవారికి ఉచిత విద్య అందిస్తారు. ఈ ఆదర్శ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ విద్య బోధిస్తారు. సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..