తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం (జులై 7) వెలువడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలు పొందుపరుస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 12 నుంచి 20 వ‌ర‌కు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం ఫస్టియర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్‌ వారికి పరీక్షలు జ‌రిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షాకేంద్రాల్లో ఈ ప‌రీక్షల‌ను నిర్వహించారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌కి క‌లిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాశారు. ఇందులో ఫస్టియర్‌కి 2,70,583 మంది, సెకండియ‌ర్‌కి 1,41,742 మంది విద్యార్థులు ఈ ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యారు.

Continues below advertisement


ఇంటర్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్: https://tsbie.cgg.gov.in


టెన్త్ ఫలితాలు కూడా..
మరోవైపు పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఫలితాలను శుక్రవారం(జులై 7న) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు గురువారం(జులై 6న) ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు జూన్ 14 నుంచి 22 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్‌లలోనూ అందుబాటులో ఉంచనున్నారు. 


పదోతరగతి ఫలితాల కోసం వెబ్‌సైట్: https://bse.telangana.gov.in/


TS SSC Supplementary Results 2023 


TS Inter 1st year Supply Results 2023


TS Inter 2nd year Supply Results 2023 


ALSO READ:


ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి తుది గడువును జూన్ 25 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ జులై 1న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు తీసుకోవాలని,  ఆయా కాలేజీల జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులకు మిత్తల్ సూచించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా.. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు నవీన్‌మిట్టల్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇక తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష! ఐఐటీ కౌన్సిల్‌లో నిర్ణయం!
జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్‌(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌‌కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్‌, జేఈఈ మెయిన్‌ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్‌, ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్‌ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి  నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్‌ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ మీటింగ్‌కు సంబంధించిన  తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial