TS Inter Supply Results | హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. గురువారం (జూన్ 11న) ఉదయం ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఫస్టియర్, సెకండియర్ సంబంధించిన సాధారణ (జనరల్), ఒకేషనల్ కోర్సుల ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. తెలంగాణ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఇటీవల జరిగిన సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.80 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ బోర్డు ఈ ఫలితాలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే విడుదల చేసింది. పరీక్షలు రాసిన విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఫలితాలు చెక్ చేసుకోవాలని సూచించారు. తమ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలి. మార్కుల షీట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీన ప్రారంభమై 28న ముగిశాయి. అయితే కాలేజీలలో ప్రవేశాలు, విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని రిజల్ట్స్ త్వరగా విడుదల చేశారు. 17 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలలో ఇంటర్ బోర్డ్ ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ పూర్తిచేసింది. విద్యార్థులు tgbie.cgg.gov.in తో పాటు results.cgg.gov.in అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ మార్క్స్ మెమోను సులువుగా చెక్ చేసుకోవచ్చు.
