Telangana School Holidays | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పండుగ లాంటి వార్త చెప్పింది. స్కూళ్లకు వరుసగా మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. స్కూల్ విద్యార్థులకు  ఏప్రిల్ నెలలో వరుసగా 3 రోజులు సెలవులు అని ప్రభుత్వం ప్రకటనతో ఎగిరి గంతేస్తున్నారు. ఏప్రిల్ 12 నుంచి 14వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు హాలిడేస్ వచ్చాయి. అసలే సమ్మర్ కావడంతో వికేషన్ కు కూడా కొందరు తల్లిదండ్రులు ప్లాన్ చేసుకుంటున్నారు.

మూడు రోజులు వరుస సెలవులు..ఏప్రిల్ 12న సెలవు. రెండో శనివారం కావడంతో ఆరోజు సెలవు ప్రకటించారు. ఆదివారం కావడంతో ఏప్రిల్ 13న మరో హాలిడే వచ్చింది. సాధారణంగా రెండో శనివారం, ఆదివారం రోజు స్కూళ్లకు ఎలాగూ సెలవులు ఇస్తారు. అయితే సోమవారం సైతం సెలవు వచ్చింది. ఏప్రిల్ 14వ తేదీన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సెలవుదినంగా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. దాంతో వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఈ సమ్మర్ లో చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.

ఏప్రిల్ నెలలో మరికొన్ని సెలవులు సైతం ఉన్నాయి. ఏప్రిల్ 10వ తేదీన మహవీర్ జయంతి. జైన తీర్థంకరుడు మహావీరుడి జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడే నిర్ణయించారు. ఆపై ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా స్కూళ్లతో పాటు కాలేజీలకు సైతం సెలవు ఇస్తారు. ఇటీవల ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రంలో స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్. వచ్చే ఏడాది వర్కింగ్ డేస్, హాలిడేస్ సంబంధించి విద్యాశాఖ ఇదివరకే అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది.

ఏపీలో సైతం వరుసగా మూడు రోజులు విద్యార్థులకు సెలవులు వస్తున్నాయి. ఏప్రిల్ 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజులపాటు స్కూళ్లకు సెలవు ఉంటుంది. రెండో శనివారం, ఆపై ఆదివారం, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం సైతం పాఠశాలలకు సెలవు ప్రకటనతో విద్యార్థులు పండగ చేసుకోనున్నారు. ఏపీలోనూ త్వరలోనే సమ్మర్ హాలిడేస్ ప్రారంభం కానున్నాయి.