2023 సంవత్సరానికి సంబంధించి జనరల్ సెలవులు, ఆప్షనల్ సెలవులు, వేతనంతో కూడిన సెలవుల లిస్టును తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ విడుదల చేశారు. మొత్తం 2023లో 28 జనరల్ సెలవులు, 24 ఆప్షనల్ సెలవులున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులతో పాటు ఉన్నతాధికారుల అనుమతితో 5 మాత్రమే ఆప్షనల్ హాలిడేస్ పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది. వాటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో  పండగల కోసం, స్పెషల్ డేస్ కోసం 23 నోటిఫైడ్ సెలవులున్నాయి. ఇక ఆదివారం, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. 


దీపావళి పర్వదినం సైతం ఆదివారం నాడే వచ్చింది. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండగా అక్టోబర్ 10న వచ్చింది. ఆ రోజు సెలవు ఉంటుంది. ఇంకా విజయవదశమి సందర్భంగా అదే నెల 24న ప్రభుత్వం సెలవును ప్రకటించింది. దీపావళి సెలవును నవంబర్ 12న ప్రకటించింది ప్రభుత్వం. మే నెలలో ఒక్క సెలవు కూడా రాలేదు. ప్రభుత్వం ప్రకటించిన ఈ సెలవు రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.


సాధారణ సెలవులు ఇవే...


01/01/2023 – ఆదివారం – న్యూ ఇయర్


14/01/2023 – శనివారం – భోగి


15/01/2023 – ఆదివారం – సంక్రాంతి 


26/01/2023 – గురువారం – రిపబ్లిక్ డే


18/02/2023 – శనివారం – మహాశివరాత్రి


07/03/2023 – మంగళవారం – హోలీ


22/02/2023 – బుధవారం – ఉగాది


30/03/2023 – గురువారం – శ్రీరామ నవమి


05/04/2023 – బుధవారం – బాబు జగ్జీవన్ రాం జయంతి


07/04/2023 – శుక్రవారం – గుడ్ ఫ్రైడే


14/04/2023 – శుక్రవారం – డా.బీఆర్ అంబేద్కర్ జయంతి


22/04/2023 – శనివారం – రంజాన్


23/04/2023 – ఆదివారం – రంజాన్ మరుసటి రోజు


29/06/2023 – గురువారం – బక్రీద్


17/07/2023 – సోమవారం – బోనాలు


29/07/2023 – శనివారం – మొహర్రం


15/08/2023 – మంగళవారం – ఇండిపెండెన్స్ డే


07/09/2023 – గురువారం – కృష్ణాష్టమి


18/09/2023 – సోమవారం – వినాయక చవితి


28/09/2023 – గురువారం – మిలాద్ ఉన్ నబీ


02/10/2023 – సోమవారం – మహాత్మా గాంధీ జయంతి


14/10/2023 – శనివారం – ఎంగిలి పూల బతుకమ్మ


24/10/2023 – మంగళవారం – దసరా


25/10/2023 – బుధవారం – దసరా మరుసటి రోజు


12/11/2023 – ఆదివారం – దీపావళి


27/11/2023 – సోమవారం – గురు నానక్ జయంతి


25/12/2023 – సోమవారం – క్రిస్మస్


26/12/2023 – మంగళవారం – బాక్సింగ్ డే


మిగిలిన సెలవుల వివరాలు ఇలా..