రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పాఠశాలల నుండి యూనివర్సిటీల వరకు అన్ని విద్యా సంస్థల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల‌తో పాటు టీచ‌ర్లు, సిబ్బందికి బ‌యో మెట్రిక్ హాజ‌రును త‌ప్పనిస‌రి చేసింది. ఈ మేరకు విద్యా శాఖ సెక్రెటరీ వాకాటి కరుణ బుధవారం (అక్టోబరు 12) అదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి చర్యలను వేగవంతం చేయాలని ఆమె కోరారు. 



ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్యా కాలేజీలు, వర్సిటీలలో ఆధార్ సహిత బయో మెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేసింది. విద్యార్థులతోపాటు టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి బయో మెట్రిక్ అటెండెన్స్ అమలు చేయాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఆయా విద్యా సంస్థల్లో ఎంత స‌మ‌యం ప‌ని చేస్తున్నారు. వారి సెల‌వులు, ఇత‌ర‌త్రా విష‌యాల‌కు కూడా బ‌యో మెట్రిక్ హాజ‌రు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఉత్తర్వుల్లో పేర్కొంది. 



స్కాల‌ర్‌షిప్‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ను విడుద‌ల చేసేందుకు హాజ‌రు శాతాన్ని తెలుసుకునేందుకు బ‌యోమెట్రిక్ ఉపయోగపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్టోబర్ 1 నుండి బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే  సెలవుల నేపథ్యంలో వాయిదాపడింది. తాజాగా స్పష్టమైన ఆదేశాలను  ఈ మేరకు కళాశాల విద్యా శాఖ కమిషనర్ అమలుకు అనుమతి కోరారు. అనుమతి నిస్తూ.. బయో మెట్రిక్ హాజరును అమలు చేయాలని ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విభాగాలను విద్యాశాఖ ఆదేశించింది.


 


Also Read 


మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌!! దరఖాస్తు చేసుకోండి, అర్హతలివే!
మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌’  నోటిఫికేషన్‌ వెలువడింది.  ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా ఈ ఉపకారవేతనం అందిస్తోంది. డిప్లొమా, డిగ్రీ కోర్సులు చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు ఈ స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.  ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సరైన అర్హతలున్న మహిళలు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఎవరు అర్హులు?

* డిప్లొమా విభాగానికి దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ విద్యా సంవత్సరానికి టెక్నికల్‌ డిప్లొమా లెవెల్‌ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. లేటరల్‌ ఎంట్రీ ద్వారా డిప్లొమా ద్వితీయ సంవత్సరంలో చేరినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

* డిగ్రీ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఏదేని టెక్నికల్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. లేటరల్‌ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందినవారు కూడా అర్హులే. 

* పదోతరగతి/ ఇంటర్‌ పూర్తిచేసిన రెండేళ్లలోపు ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిప్లొమా/ డిగ్రీ ప్రవేశాలు పొంది ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇతర మెరిట్‌ స్కాలర్‌షిప్స్‌ పొందుతున్నవారు, పీఎంఎస్‌ఎస్‌ఎస్‌ స్కీం కింద చదువుకుంటున్నవారు, నాన్‌ టెక్నికల్‌ కోర్సుల్లో చేరినవారు, డ్యూయెల్‌ డిగ్రీ/ పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు, ఇతరత్రా స్టయిపెండ్‌/ ఆదాయం పొందుతున్నవారు దరఖాస్తుకు అనర్హులు.
నోటిఫికేషన్, స్కాలర్‌షిప్ అర్హత వివరాల కోసం క్లిక్ చేయండి.


పేద విద్యార్థులకు వరం - ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనం, ఎంపిక ఇలా!
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.
నోటిఫికేషన్‌, స్కాలర్‌షిప్ అర్హత వివరాల కోసం క్లిక్ చేయండి.