Telangana 10th Results 2025: తెలంగాణ పదోతరగతి ఫలితాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేయనుంది. మార్కుల మెమో ముద్రణపై క్లారిటీ రావడంతో రేపు ఫలితాలు విడుదలకు లైన్ క్లియర్ అయింది. దీంతో రేపు ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పదోతరగతి మార్కుల మెమోలపై మార్కులతోపాటు గ్రేడ్స్‌ను సైతం ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను ఏప్రిల్ 8న పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపించింది. ఈ మధ్యే దీన్ని ప్రభుత్వం అంగీకరించింది. దీంతో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా జారీ చేసిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి పదోతరగతిలో గ్రేడింగ్‌ విధానాన్ని తీసివేయనున్నారు. 

పదోతరగతిలో సబ్జెక్టులవారీగా గ్రేడ్లతోపాటు క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్(CGPA) ముద్రించే వాళ్లు. ఇప్పుడు కొత్త విధానం ప్రకారం మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇస్తారు. గ్రేడ్లస్థానంలో మార్కుల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ ఏడాది నుంచే ఇంటర్నల్స్‌ రద్దు చేయాలని భావించారు. కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైంది. అందుకే ఈ దఫా మాత్రం ఇటర్నల్స్ ఉంచారు. వచ్చే ఏడాది నుంచి వీటిని రద్దు చేయనున్నారు. 

మార్క్‌షీట్ ఎలా ఉంటుంది?ఈ ఏడాది పాస్ అయ్యే పదోతరగతి విద్యార్థులకు వచ్చే మార్క్‌షీట్‌లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఉన్న జీపీఏ కనిపించదు.  సబ్జెక్టులవారీ వచ్చే మార్కులతోపాటు, ఇంటర్నల్ మార్క్‌లతో కలిపి మొత్తం మార్కులు, గ్రేడుగా పేర్కొంటారు. లాస్ట్‌లో విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా? ముద్రిస్తారు. కో కరిక్యులర్ యాక్టివిటీస్‌లో గ్రేడ్లు ఇస్తారు.  

* ఎస్‌ఎస్‌సీ మార్క్‌ మెమోలపై ఇంటర్నల్స్‌ మార్కులు, వార్షిక పరీక్షల మార్కులు వేస్తారు. మొత్తం మార్కులతో పాస్‌ సర్టిఫికెట్‌ అందజేస్తారు. గ్రేడ్లు, మార్కులు వేర్వేరుగా ఇస్తారు. 

* సబ్జెక్టులవారీగా సాధించిన మార్కు లు, గ్రేడ్లు రెండు కూడా సర్టిఫికెట్‌లో కనిపిస్తాయి. 

* పదోతరగతిలో ఇంటర్నల్స్‌లో 20 మార్కులు ఇచ్చారు. పాస్‌ సర్టిఫికెట్‌లో వీటిని చూపుతారు.

* 20 ఇంటర్నల్‌ మార్కులు ఉన్నందున ఒక్కో సబ్జెక్టులో 80 మార్కులకే వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో 28 మార్కులు వస్తే పాస్ అవుతారు. 

* ఇంటర్నల్స్‌ మార్క్స్‌తో సంబంధం లేకుండా 28 మార్కులు రావాలి. లేకుంటే ఫెయిల్ అయినట్టు లెక్క. హిందీ సబ్జెక్ట్‌లో మాత్రం 16 మార్కులు వస్తే సరిపోతుంది. 

* మెమోలపై ఫస్ట్‌ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేదేమీ ఉండదు. ఎన్ని మార్కులు వచ్చినా పాస్‌ అని మాత్రమే ఉంటుంది.