తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది. సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 8 మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా వెల్లడించింది. అయితే సెప్టెంబర్ 25, అక్టోబర్ 9 ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ఉంటాయని తెలిపింది. విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్ 10న అంటే సోమవారం ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 5న దసరా పండుగ జరుపుకోనున్నారు. 

ఈ సారి 9,10 తరగతులకు సెలవులు తగ్గించాలని భావిస్తున్నట్టు మొదట్లో వార్తలొచ్చినా... తాజాగా మొత్త 15 రోజులు సెలవు దినాలుగా ప్రకటించింది. దీనికి కారణం గత నెలలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ఇచ్చారు. అనుకున్న ప్రకారం దసరా సెలవులు ఇస్తే సమయానికి సిలబస్ పూర్తి కాదని.. ఆ తర్వాత పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోందని జోరుగా ప్రచారం సాగింది. అందుకే దసరా సెలవులను ఆయా తరగతులకు కుదించాలని చూస్తున్నట్లు కూడా టాక్ వచ్చింది. తాజాగా వెలువడిన ప్రభుత్వ అధికారిక ప్రకటనతో ఆ ప్రచారానికి తెర పడింది.

Also Read:   ఏపీలో 'దసరా' సెలవులు ఇవే! ఎన్నిరోజులంటే!

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇవే..

♦ సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 8 వరకు దసరా సెలవులు (13 రోజులు). రెండు ఆదివారాలు కలిపి మొత్తం 15 రోజులు సెలవులు ఉండనున్నాయి.

♦ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.

♦ జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు


♦ వేసవి సెలవులు ఏప్రిల్ 25‌, 2023 నుంచి జూన్‌ 11, 2023 వరకు.


Also Read


APOSS Admissions: ఏపీ సార్వత్రిక విద్యాపీఠంలో పదోతరగతి, ఇంటర్ ప్రవేశాలు
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ 2022-23 విద్యా సంవత్సరానికి పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. చదువుకోవాలని కోరిక వుండి వివిధ కారణాల వల్ల చదువు కొనసాగించలేనివారి కోసం ముఖ్యంగా బాలికలు, గ్రామీణ యువత, పనిచేయి స్త్రీ, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, ప్రత్యేక అవసరాలు గల వారికి  విద్యనందించడమే ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ప్రవేశ ప్రకటన, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read

NVS: నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న  650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు. రాతపరీక్ష ఆధాంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశప్రకటన, ఎంపిక విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..