రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 2 నుంచి టీచర్ల బదిలీలు చేపట్టనుంది. ఈ మేరకు రేపు తెలంగాణ విద్యాశాఖ శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేయనుంది. టీచర్ల బదిలీలకు బుధవారం హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. అందుకోసం ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తున్నది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించనుంది.


కాగా, తుది తీర్పునకు లోబడే టీచర్ల బదిలీలు జరగాలని హైకోర్టు ఆదేశించింది. కాబట్టి హైకోర్టు ఆదేశానుసారమే టీచర్ల బదిలీల ప్రక్రియ జరగనుంది. వాస్తవానికి విద్యాశాఖ టీచర్ల బదిలీల షెడ్యూల్‌ను జనవరిలో విడుదల చేసింది. ఫిబ్రవరిలోనే బదిలీలు చేపట్టాల్సి ఉన్నది. 59 వేల మందికిపైగా టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. ఈ దశలో హైకోర్టు స్టే జారీచేయడంతో బదిలీలు నిలిచిపోయాయి.


తాజాగా స్టే ఎత్తివేయడంతో బదిలీలు, పదోన్నతులకు పచ్చజెండా ఊపినట్టయింది. గతంలో బదిలీలకు కటాఫ్‌ తేదీని ఫిబ్రవరి 1గా ఖరారు చేశారు. తాజాగా ఈ గడువును సెప్టెంబర్‌ 1గా నిర్ణయించారు. దీంతో జూలై 2015 తర్వాత వారు కూడా తప్పనిసరిగా బదిలీ అవుతారు. 


కోర్టు వివాదాలతో కొన్ని నెలలుగా ఆగిన ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో తీసుకువచ్చిన జీవో 5 అమలను నిలిపివేస్తూ ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది.


ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు హైకోర్టు పచ్చ జెండా ఊపడంతో ఇక విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శాసనసభ ఎన్నికలు కూడా సమీపిస్తుండడంతో సానుకూల నిర్ణయం దిశగా సర్కారు అడుగులు ఉంటాయని అంతా భావిస్తున్నారు. విద్యా సంవత్సరం మొదలై కేవలం రెండున్నర నెలలే కావడం... గత మార్చిలోనే దరఖాస్తులు స్వీకరించినందున మళ్లీ సవరణలకు అవకాశం ఇచ్చినా 20 రోజుల్లోనే బదిలీలు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయవచ్చని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


తాత్కాలికంగా పదోన్నతులు ఇవ్వాలని,  తీర్పు తర్వాత బదిలీలు చేపట్టవచ్చని ఉపాధ్యాయ సంఘాలు కోరిన హైకోర్టు తీర్పు తర్వాత రెండింటిని కలిపే నిర్వహిస్తామని విద్యాశాఖ గత కొన్ని నెలలుగా చెబుతూ వచ్చింది. అయితే ఇప్పుడు బదిలీలపై స్టే ఎత్తివేస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం ఇందుకు సన్నాహాలు చేస్తుంది. ఒకవేళ ఉపాధ్యాయ సంఘాల నేతలు పది పాయింట్లు తొలగించడంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఈ ప్రక్రియ చేపట్టేందుకు అవరోధం ఉన్నదని నిపుణులు భావిస్తున్నారు. 


గెజిట్ హెచ్ఎంల పదోన్నతులు


సర్కారు తొలుత గెజిటెడ్ హెచ్ఎం లను బదిలీ చేస్తారు. తర్వాత హెచ్ఎం ఖాళీలను స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు భర్తీ చేస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు ఇచ్చి స్కూల్ అసిస్టెంట్ల స్థానాల్లో నియమిస్తారు. రాష్ట్రంలో 2015 జూలైలో బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. 2018లో బదిలీ చేశారు. అంటే 8 సంవత్సరాల తర్వాత రెండోసారి పదోన్నతులు, ఐదేళ్ల తర్వాత సాధారణ బదిలీలు జరుగుతాయి. 


వెంటనే చేపట్టాలని సంఘాల వినతులు


బదిలీలు, పదోన్నతులపై సంబంధించిన ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరు ప్రకటనలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. పదోన్నతుల ప్రక్రియ పూర్తయితేనే పూర్తికాలిల సంఖ్య తెలుస్తుందని అందువల్ల ఉద్యోగ నోటిఫికేషన్ ను పదోన్నతుల తర్వాత ప్రకటించాలని దీనివల్ల నిరుద్యోగులకు కూడా లాభం చేకూరుతుందని పలు సంఘాలు విజ్ఞప్తులు చేస్తున్నాయి.