Anganwadi Posts: తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 14 వేల ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క వెల్లడించారు. ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి ఆమె డిసెంబరు 18న శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. ములుగులోని తన క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.


మహాలక్ష్మి పథకం గురించి ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారి సంఘాలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చర్చించిన తర్వాతే హామీని ప్రకటించామని తెలిపారు. ఆటోడ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన్నారు. 


ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలు..
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSWR) ప్రవేశాలు కల్పించనుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్‌ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ఇంటెన్సివ్ కోచింగ్‌ కూడా ఉచితంగా కల్పిస్తారు. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్..
తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా బీసీ (MJPTBCWREIS), ఎస్సీ ( TSWREIS), ఎస్టీ (TTWREIS), బీసీ (MJPTBCWREIS) గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి అర్హులు. విద్యార్థులు డిసెంబరు 18 నుంచి జనవరి 6 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపికచేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తారు. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ: 


సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ- 2024) 10వ తరగతి & 12వ తరగతి బోర్డు పరీక్షల కోసం టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 02 వరకు నిర్వహిస్తారు.  ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం ఉదయం 10:30 నుంచి మొదలవుతాయని తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ షీట్లను రూపొందించారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...