Silver Jubilee CET 2024: సిల్వర్ సెట్‌ - 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

Kurnool News: కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల ప్రవేశ ప్రకటన వెలువడింది. 2024-25 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

Continues below advertisement

Silver Jubilee Government College- Kurnool Admissions:  కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2024-25 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సిల్వర్ సెట్-2024' పరీక్షకు మే 4న ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూన్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను జూన్ 16న నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ 10 నుంచి అందుబాటులో ఉంచనునున్నారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తుకు అర్హులు. 

Continues below advertisement

ఆన్‌లైన్  ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్‌డెస్క్ 022-62507712 నంబరులో లేదా ఈమెయిల్:  sjgdc2024@onlineregistrationform.org ద్వారా సంప్రదించవచ్చు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. 

వివరాలు..

* సిల్వర్ సెట్ - 2024

అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులు: బీఏ, బీకామ్, బీఎస్సీ.

దరఖాస్తు ఫీజు: రూ.700.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో మూడు పేపర్లు ఇంటర్ సంబంధిత సబ్జెక్టుల నుంచి, ఒకటి ఇంగ్లిష్ పేపర్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష కేంద్రాలు: ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.05.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.06.2024. (23:59 hrs.)

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 04.06.2024.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 10.06.2024.

➥ ఆన్‌లైన్ (సీబీటీ) పరీక్షతేది: 16.06.2024

Notification

Online Application

Website

ALSO READ:

తెలంగాణలో ఇంట‌ర్ ప్రవేశాలు ప్రారంభం, అడ్మిషన్ షెడ్యూలు ఇలా
తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశా ప్రక్రియ మే 9న ప్రారంభమైంది. పదోతరగతి ఉత్తీర్ణులై, ఇంటర్ ప్రవేశాలు కోరువారు మే 9 నుంచి మే 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా ఇంట‌ర్ కాలేజీల్లో సమర్పించవచ్చు. ప్రవేశాలు పొందినవారికి జూన్ 1 నుంచి ఇంట‌ర్ త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30 లోపు తొలిద‌శ అడ్మిష‌న్ల ప్రక్రియ పూర్తి చేయ‌నున్నారు. ఈ మేరకు ప్రవేశాల షెడ్యూలును ఇంటర్ బోర్డు మే 8న విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, మైనారిటీ, సహకార, గురుకుల, కేజీబీవీ, ఆర్‌జేసీ, మోడల్, కాంపొజిట్, ఒకేషనల్ తదితర జూనియర్ కళాశాలలన్నీ ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూలును పాటించాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola