SBI Platinum Jubilee Asha Scholarship Apply Online: బ్యాంకింగ్ రంగంలో ఎస్బీఐ చాలా ప్ర‌త్యేకం.. ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్‌గా పేరు పొందిన భార‌తీయ స్టేట్ బ్యాంకు త‌న సామాజిక బాద్య‌త నిధుల నుంచి ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది.. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఆర్దీకంగా వెనుక‌బాటుకు గురైన‌ పేదింట ప్ర‌తిభావంతులైన ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు సంస్థ‌ల్లో చ‌దివే విద్యార్థుల‌కు త‌న వంతు సాయం అందిస్తోంది..ఎస్‌బీఐ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఎస్‌బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాల‌ర్ షిప్ పేరుతో  ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతుండ‌గా తొమ్మిదో త‌ర‌గ‌తి నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ వ‌ర‌కు విద్యార్థులు అర్హుల‌ని ప్ర‌క‌టించింది.. 

Continues below advertisement

మీరు ప్ర‌తిభావంతులైన పేద విద్యార్థులైతే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు..

దేశ‌ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులు, అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్స్‌, వైద్య విద్యార్థులు, ఐఐటీ, ఐఐఎం విద్యార్థులతో పాటు విదేశాల్లో విద్య‌న‌భ్య‌సిస్తున్న‌ విద్యార్థుల కు స్కాలర్‌షిప్‌ల అందించేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్ (SBI Foundation) ఆధ్వర్యంలో  ఇటీవ‌లే ఓ ప్రకటన వెలువరించింది. 2025-26 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు సంబందించి  మొత్తం 23,230 మందికి స్కాలర్‌షిప్‌లను  అందించేందుకు ముందుకు వచ్చింది.  రూ.90 కోట్లు మేర విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు అందించేందుకు నిధులు కేటాయించింది. అప్లై చేసుకోవడానికి క్లిక్ చేయండి https://www.sbiashascholarship.co.in/

Continues below advertisement

2015లో స్థాపించిన ఎస్‌బీఐ ఫౌండేష‌న్ ద్వారా అనేక సేవాకార్య‌క్ర‌మాలు చేప‌డుతోన్న ఈ సంస్థ‌ 2022 నుంచి ఎస్‌బీఐ ఫౌండేష‌న్ ద్వారా ఈ ఆశా స్కాలర్‌షిప్‌లను దేశ‌వ్యాప్తంగా ఉన్న పేద వ‌ర్గాలు, వెనుకబడిన త‌ర‌గ‌తుల విద్యార్థుల కోసం ఈబృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టి కొన‌సాగిస్తోంది.. ఈ మేరకు ఈ ఏడాదికి కూడా స్కాలర్‌షిప్‌ అందించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఎస్‌బీఐ ఛైర్మన్‌ సీఎస్‌ శెట్టి ఇటీవ‌లే ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. స్కాలర్ షిప్ కోసం క్లిక్ చేయండి

స్కాల‌ర్‌షిప్‌ పొందుకునేందుకు ఎవ‌రెవ‌రు అర్హులంటే.. ఎస్‌బీఐ ఆశా స్కాలర్‌షిప్‌కు ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో 9వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకు చదివే పేదింటి విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు 2024-25 విద్యా సంవత్సరంలో 75 శాతం మార్కులు లేదా 7 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు 10 శాతం అంటే 67.5 శాతం మార్కులు లేదా సీజీపీఏ 6.30 సాధించాల్సి ఉంటుంది. ఇక విద్యార్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు మించకుండా ఉండాల‌న్న నిభంద‌న‌ల‌ను నోటిఫికేష‌న్‌లో వెలువ‌రించారు..

చివ‌రి తేదీ ఇదే..  

ఎస్‌బీఐ ఆశా స్కాలర్ షిప్ పొందుకునేందుకు ద‌ర‌ఖాస్తుకు పైన ఉద‌హ‌రించిన‌ అర్హత కలిగిన విద్యార్థులు 15 నవంబర్‌  2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ లో ఆశాస్కాల‌ర్‌షిప్స్ అని ఇక ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్ధులు తాము ఎంపిక చేసుకున్న కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.15 వేలు నుంచి రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనుంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్ధులు ఏటా రెన్యువల్‌ కావాలంటే.. చదివే కోర్సుల్లో కనీస అర్హత ప్రమాణాలు అంటే అటెండెన్స్, ఉత్తీర్ణత మార్కులు వంటివి పాటించాల్సి ఉంటుంది