TS Scholarships: విద్యార్థులకు అలర్ట్, స్కాలర్‌షిప్‌ రిజిస్ట్రేషన్లు అప్పటినుంచే!

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాం గుల విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త స్కాలర్‌షిప్‌, రెన్యూవల్‌ కోసం కాలేజీలు, విద్యార్థులు వివరాలు నమోదు చేసుకోవాలి.

Continues below advertisement

తెలంగాణలో 2022-23 విద్యాసంవత్సరానికి పోస్టుమెట్రిక్‌ స్కా లర్‌షిప్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగుల ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త స్కాలర్‌షిప్‌, రెన్యూవల్‌ కోసం కాలేజీలు, విద్యార్థులు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ-పాస్ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 15 నుండి అక్టోబర్ 15 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. 

అధికారిక వెబ్‌సైట్: telanganaepass.cgg.gov.in

వీరే అర్హులు..
SC, STకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. BC, EBC లేదా వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే వారి ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్థి హాజరు శాతం ప్రతి త్రైమాసికం చివరిలో 75 శాతంగా ఉండాలి. 

అవసరమైన డాక్యుమెంట్లు..
పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (PMS) కోసం దరఖాస్తు చేసుకునే విద్యా్ర్థులు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో విద్యార్థుల క్వాలిఫైయింగ్ పరీక్ష మార్కుల షీట్‌తో పాటు ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలకు సంబంధించి పాస్ బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాలి. తప్పుడు సమాచారం నమోదు చేస్తే దరఖాస్తులను తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో జాగ్రత్తగా వివరాలను నమోదు చేయాలి. 

Continues below advertisement

Related Articles:

బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్..
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా ఆసరా  ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (YASASVI) ప్రవేశ పరీక్ష-2022 నిర్వహణకు గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న పాఠశాల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. యశస్వి అనేది ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ), డీ-నోటిఫైడ్, నోమాడిక్ & సెమీ నోమాడిక్ ట్రైబ్స్ (డీఎన్‌టీ/ ఎస్ఎన్‌టీ) వర్గాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్ పథకం. 

అర్హతలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మైనార్టీ’ ఉపకార వేతనాలకు దరఖాస్తులు

తెలంగాణలో మైనార్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్, మెరిట్ ఉపకార వేతనాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రీమెట్రిక్ విద్యార్థులు సెప్టెంబరు 30లోగా.. ఇంటర్, ఆ పైన చదివే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మైనారిటీ విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరానికి నేషనల్ మైనార్టీస్ ఫ్రీ మెట్రిక్ (1వ తరగతి నుంచి 10వ తరగతి), పోస్ట్ మెట్రిక్ విభాగంలో ఇంటర్మీడియట్ నుంచి పీహెచ్‌డీ గవర్నమెంట్ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలు, ఐ.టి.ఐ లేదా ఐ.టి.సి టెక్నికల్ కోర్సులు, గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మైనారిటీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్
-2008లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకం
-కేంద్రం 75 శాతం నిధులను సమకూరుస్తుంది.
-కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం నిధులను ఇస్తుంది.

పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్
-2007లో ప్రారంభించారు.
-100 శాతం కేంద్రమే నిధులను సమకూరుస్తుంది.
-2007లో మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్‌ని ప్రారంభించారు. ఈ పథకం టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులను ఉద్దేశించింది.
Website

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Continues below advertisement
Sponsored Links by Taboola