ఉత్తర్ ప్రదేశ్ అమేథీలోని రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ 2024 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా, బీఎంఎస్ ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ప్రోగ్రాం అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో 10+2, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్/ ఓబీసీ (బాలురు) అభ్యర్థులకు రూ.1000; బాలికలు/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ కేటగిరీలకు రూ.500. వయోపరిమితి ప్రోగ్రాం అనుసరించి 21, 25 సంవత్సరాలు మించకూడదు. సరైన అర్హతలున్న వారు జూన్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రోగ్రాం వివరాలు..
* పీజీ డిప్లొమా ఇన్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్
సీట్ల సంఖ్య: 120.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5% సడలింపు ఉంటుంది.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ (బాలురు) అభ్యర్థులకు రూ.1000; బాలికలు/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ కేటగిరీలకు రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: డిగ్రీ మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.06.2024.
ప్రోగ్రాం వివరాలు..
* బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (బీఎంఎస్)
సీట్ల సంఖ్య: 120.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌తో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5% సడలింపు ఉంటుంది.
వయోమిపరితి: 21 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ (బాలురు) అభ్యర్థులకు రూ.1000; బాలికలు/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ కేటగిరీలకు రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: 10+2 మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 21.06.2024.
ALSO READ:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు
Indian Institute of Packaging IIPCET - 2024: ముంబయి ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు రీజినల్ సెంటర్లలో పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్, మాస్టర్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ (ఎంఎస్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు సైన్స్ డిగ్రీ, ఎంఎస్ కోర్సులో ప్రవేశాలకు గ్రాడ్యుయేషన్ (ఇంజినీరింగ్ & టెక్నాలజీ) డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలున్నవారు జులై 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి జులై 14న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, కోర్పు వివరాల కోసం క్లిక్ చేయండి.నోటిఫికేషన్, కోర్పు వివరాల కోసం క్లిక్ చేయండి
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, పరీక్ష వివరాలు ఇలా
Joint CSIR-UGC NET June 2024: దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాదికి గాను 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్-జూన్ 2024' నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 1న ప్రారంభంకాగా.. మే 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.