PVNRTVU Ph.D.Admissions: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ 2023-24 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 09 సీట్లను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీవీఎస్సీ, ఎంవీఎస్సీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఐసీఏఆర్‌- ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)- 2023 ర్యాంకు ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వివరాలు..

* పీహెచ్‌డీ కోర్సులు

సీట్ల సంఖ్య: 09 

సబ్జెక్టులు: వెటర్నరీ పారాసైటాలజీ, వెటర్నరీ పాథాలజీ, యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ సర్జరీ అండ్‌ రేడియాలజీ, యానిమల్ న్యూట్రిషన్.

సబ్జెక్టుల వారీగా ఖాళీలు..

1. వెటర్నరీ పారాసైటాలజీ: 01

2. వెటర్నరీ పాథాలజీ 01

3. యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్: 01

4. లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్: 01

5. పౌల్ట్రీ సైన్స్: 01

6. వెటర్నరీ మెడిసిన్: 01

7. వెటర్నరీ సర్జరీ & రేడియాలజీ: 01

8. యానిమల్ న్యూట్రిషన్*: 02

అర్హత: సంబంధిత విభాగంలో బీవీఎస్సీ, ఎంవీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.  

వయోపరిమితి: 01.07.2023 నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు. 

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఐసీఏఆర్‌- ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)- 2023 ర్యాంకు ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన సర్టిఫికేట్‌లు..

➥ కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన నేటివిటీ సర్టిఫికేట్.

➥ ఐసీఏఆర్‌- ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)- 2023 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్.

➥ బీవీఎస్సీ అండ్ ఎంవీఎస్సీ పరీక్షలో పొందిన మెమోరాండా మార్క్స్/ ట్రాన్స్క్రిప్ట్.

➥ బీవీఎస్సీ అండ్ ఎంవీఎస్సీ పరీక్షల యొక్క తాత్కాలిక/ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లు

➥ ఎస్‌ఎస్‌సీ/తత్సమాన సర్టిఫికెట్

➥ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర కాంపిటెంట్ అథారిటీ ద్వారా జారీ చేయబడిన సామాజిక స్థితి ధృవీకరణ పత్రాన్ని జతపరచాలి. EWS కోటాను కోరుకునే అభ్యర్థులు ఈ మేరకు జారీ చేసిన సర్టిఫికేట్‌ను జతచేయాలి. కాంపిటెంట్ అథారిటీ ద్వారా అభ్యర్థుల సామాజిక హోదా క్లెయిమ్‌ల వాస్తవికతను ప్రభుత్వంలోని సంబంధిత విభాగాలు ధృవీకరించే వరకు ఈ కేటగిరీల కింద ఇచ్చిన అడ్మిషన్ తాత్కాలికంగా ఉంటుంది.

➥ కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన పిహెచ్ సర్టిఫికేట్‌ను దివ్యాంగులు సమర్పించాలి.

➥ గుర్తింపు పొందిన ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి 6వ తరగతి నుంచి స్టడీ సర్టిఫికేట్లు, ప్రైవేట్ స్టడీ ద్వారా ఏదైనా పరీక్షకు హాజరైన వారు ఆ కాలానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్‌ జతపరచాలి.

➥ ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయం / ANGRAU / SVVU / PVNR TVU కాకుండా ఇతర విశ్వవిద్యాలయాల నుంచి పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సంబంధించి OGPA/CGPAని మార్కులుగా మార్చడానికి చూపే సర్టిఫికేట్.

➥ చెల్లింపునకు సంబంధించిన రసీదు స్లిప్ కాపీని జతపరచాలి.

➥ ఏదైనా చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ID ప్రూఫ్

➥ పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం నుంచి కాకుండా ఇతర విశ్వవిద్యాలయం నుంచి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైతే మైగ్రేషన్ సర్టిఫికేట్.

➥ అభ్యర్థి చివరిగా చదివిన కాలేజ్/ఇన్‌స్టిట్యూషన్ నుంచి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్.

➥ కౌన్సెలింగ్ తేదీ లేదా అంతకు ముందు దరఖాస్తుదారులు ఏవైనా అవసరమైన సర్టిఫికేట్‌లను సమర్పించకపోతే, వారు కౌన్సెలింగ్‌కు అనుమతించబడరు.

ముఖ్యమైన తేదీలు...

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 30.05.2024.

* కౌన్సెలింగ్ తేదీ: 05.06.2024.

* 2023-24 విద్యాసంవత్సరం మొదటి సెమిస్టర్ కోసం రిజిస్ట్రేషన్‌: 06.06.2024.

Notification 

Online Application (Google Form) 

Application Fee Payment

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..