Pongal Holidays for Schools in Andhra Pradesh | అమరావతి: ఏపీలో విద్యార్థులకు పండుగ లాంటి వార్త వచ్చేసింది. రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ (2024-25) ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే జనవరి 10వ తేదీ (శుక్రవారం) నుంచి హాలిడేస్ ప్రారంభం అవుతాయని ఓ ప్రకటనలో తెలిపింది. సెలవులు 19న ముగియనుండగా, జనవరి 20వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని విద్యార్థులకు సూచించారు. ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా 10 రోజులపాటు స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అటు క్రిస్టియన్ పాఠశాలలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు సెలవులు ఉంటాయని విద్యాశాఖ వెల్లడించింది.