PJTSAU Diploma Admissions: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు పాలిసెట్‌-2024లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600, మిగతా అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి. తెలంగాణ పాలిసెట్-2024లో అగ్రికల్చర్ స్ట్రీమ్ కింద పొందిన ర్యాంకులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు.

వివరాలు..

అగ్రికల్చర్ యూనివర్సిటీ డిప్లొమా ప్రవేశాలు..

➥ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్

కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.

➥ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్

కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.

➥ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్

కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.

సీట్ల వివరాలు..

★ యూనివర్సిటీ పాలిటెక్నిక్‌లు: 260 సీట్లు

⏩ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు, ఇంగ్లిష్ మీడియం): 240  సీట్లు

➥ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, పాలెం (నాగర్ కర్నూల్): 20 సీట్లు

➥ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, పొలాస (జగిత్యాల): 20 సీట్లు

➥ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, కంపసాగర్ (నల్గొండ): 20 సీట్లు

➥ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, బసంత్‌పూర్ (సంగారెడ్డి): 20 సీట్లు

➥ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, మధిర (ఖమ్మం): 20 సీట్లు

➥ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, జోగిపేట (సంగారెడ్డి): 20 సీట్లు

➥ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, సిరిసిల్ల: 20 సీట్లు

➥ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, జమ్మికుంట (కరీంనగర్): 20 సీట్లు

➥ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, మాల్తుమ్మెడ (కామారెడ్డి): 20 సీట్లు

➥ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, రుద్రూర్ (నిజామాబాద్): 20 సీట్లు

➥ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, నారాయణపేట: 40 సీట్లు

⏩ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు, ఇంగ్లిష్ మీడియం): 20 సీట్లు

➥ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్, కంది, సంగారెడ్డి: 20 సీట్లు

★ అనుబంధ పాలిటెక్నిక్‌లు: 540 సీట్లు

⏩ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు, ఇంగ్లిష్ మీడియం):  390 సీట్లు

➥ డా. డి. రామా నాయుడు విజ్ఞాన జ్యోతి అగ్రికల్చర్ పాలిటెక్నిక్, తునికి (మెదక్)): 90 సీట్లు

➥ సాగర్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, చేవెళ్ల (రంగారెడ్డి): 60 సీట్లు

➥ రత్నపురి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, తుర్కల ఖానాపూర్ (సంగారెడ్డి): 60 సీట్లు

➥ మదర్ థెరిసా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, సత్తుపల్లి (ఖమ్మం): 60 సీట్లు

➥ బడే కోటయ్య మెమోరియల్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, పోలేనిగూడెం (సూర్యాపేట): 60 సీట్లు

➥ పూజ్య శ్రీ మాధవంజీ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం): 60 సీట్లు

⏩ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు, ఇంగ్లిష్ మీడియం): 60 సీట్లు

➥ ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, గింగుర్తి(వికారాబాద్): 60 సీట్లు

⏩ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు, ఇంగ్లిష్ మీడియం): 90 సీట్లు

➥ డా. డి. రామా నాయుడు విజ్ఞాన జ్యోతిఅగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్, తునికి(మెదక్): 30 సీట్లు

➥ మదర్ థెరిసా అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్, సత్తుపల్లి(ఖమ్మం): 30 సీట్లు

➥ రత్నపురి అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్, తుర్కల ఖానాపూర్ (సంగారెడ్డి): 30 సీట్లు

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పాలిసెట్‌-2024లో అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 31.12.2024 నాటికి 15 -22 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600. మిగతా అభ్యర్థులందరికీ రూ.1200.

ఎంపిక విధానం: తెలంగాణ రాష్ట్ర పాలిసెట్-2024లో అగ్రికల్చర్ స్ట్రీమ్ కింద పొందిన ర్యాంకులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 04.06.2024.

➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 25.06.2024. (5:00 PM)

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 26.06.2024. (5:00 PM)

➥ దరఖాస్తు సవరణ తేదీలు: 27.06.2024.

Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..